2 లక్షలు దాటిన కరోనా కేసులు

l రికార్టు స్థాయిలో ఒక్క రోజే 8,909 మందికి పాజిటివ్‌ l

217 మంది మృతి, 5,815కు పెరిగిన మృతులు

న్యూఢిల్లీ : భారత్‌పై కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడుతోంది. గత నాలుగైదు రోజులుగా రికార్డుస్థాయి లో రోజుకు 8 వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. బాధితులు రెండు లక్షల మార్కును దా టారు. మరణాల సంఖ్యకూడా నానాటికీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 200లకు పైగా బాధితులు ప్రా ణాలు కోల్పోతున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 8,909 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. భారత్‌లో వైరస్‌ ప్రవేశించిన నాటి నుంచి ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కేసుల సంఖ్య 2,07,615కు చేరింది. అదే విధంగా మం గళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 217 మంది మృతి చెందారు. వీరితో కలిపి మృతుల సం ఖ్య 5,815కు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 1, 01,497 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,00,302 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా రు. ఈ నేపథ్యంలో రికవరీ రేటు 48.31 శాతంగా ఉన్న ట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి చె ప్పారు. వరుసగా నాల్గొవ రోజు కూడా భారత్‌లో 8 వేల కు పైగా కేసులు నమోదైనప్పటికీ వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ప్రథమ స్థానంలో అగ్ర రాజ్యం అమెరికా కొనసాగుతుండగా, ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్‌, రష్యా, యుకె, స్పెయిన్‌, ఇటలీ దేశాలు ఉన్నాయి. కాగా, మం గళవారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 103 మంది మరణించగా, ఢిల్లీలో 33, గుజరాత్‌లో 29, తమిళనాడులో 13, పశ్చిమ బెంగాల్‌ 10, మధ్యప్రదేశ్‌ లో మరో ఆరుగురు, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ఐదుగు రు చొప్పున, తెలంగాణలో నలుగురు, హర్యానా, జ మ్మూకశ్మీర్‌లో ఇద్దరు చొప్పున, కేరళ, చండీగఢ్‌, లడఖ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకరు చొప్పున మరణించారు. కాగా, మహారాష్ట్రలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 2,465 మంది మరణించగా, గు జరాత్‌లో 1,092, ఢిల్లీలో 556, మధ్యప్రదేశ్‌లో 364, పశ్చిమ బెంగాల్‌లో 335, ఉత్తరప్రదేశ్‌లో 222, రాజస్థాన్‌లో 203, తమిళనాడులో 197, తెలంగాణలో 92, ఆంధ్రప్రదేశ్‌లో 68, కర్నాటకలో 52, పంజాబ్‌లో 46, జమ్మూకశ్మీర్‌లో 33, బీహార్‌లో 24 మంది, హర్యానా లో 23, కేరళలో 11 మంది, ఒడిశా, ఉత్తరాఖండ్‌లో ఏ డుగురు, చొప్పున, హిమాచల్‌, చండీగఢ్‌, జార్ఖండ్‌లో ఐదుగురు చొప్పున, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపిం ది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మం ది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది.
ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 మంది కరోనా బారిన పడ్డా రు. బాధితుల సంఖ్యలో రెండవ స్థానంలో తమిళనాడు ఉండగా, రాష్ట్రంలో 24,586 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,617, రాజస్థాన్‌ లో 9,373, మధ్యప్రదేశ్‌లో 8,420, ఉత్తరప్రదేశ్‌లో 8,361, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,155, ఆంధ్రప్రదేశ్‌లో 3,898, కర్నాటకలో 3,796, తెలంగాణలో 2,891, జమ్మూకశ్మీర్‌లో 2,718, హర్యానాలో 2,652, పంజాబ్‌లో 2,342, ఒడిశాలో 2,245, అసోంలో 1,513, కేరళలో 1,412, ఉత్తరాఖండ్‌లో 1,043, జార్ఖండ్‌లో 712, ఛత్తీస్‌గఢ్‌లో 564, త్రిపుర లో 468 మందికి కరోనా సోకింది. అదే విధంగా హిమాచల్‌లో దాదాపు 345 మంది కొవిడ్‌ 19 బారిన పడ్డా రు. చండీగఢ్‌లో 301, మణిపూర్‌లో 89, పుదుచ్చేరిలో 82, లడఖ్‌లో 81, గోవాలో 79 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. నాగాలాండ్‌లో 49, అండమాన్‌ నికోబార్‌లో 33 కేసులు, మేఘాలయలో 27, అరుణాచల్‌లో 22, మిజోరాంలో 13, దాదర్‌ నగర్‌ హవేలీలో నాలుగు, సిక్కింలో ఒక కేసు రికార్డు అయింది.

DO YOU LIKE THIS ARTICLE?