రాష్ట్రంలో రెండు లక్షలకు చేరువలో కరోనా బాధితులు
కొత్తగా 2009 మందికి పాజిటివ్
మరో 10 మంది కరోనాకు బలి
1145కు చేరిన మృతుల సంఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు రెండు లక్షలకు చేరింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 30 లక్షలు దాటింది. కొత్తగా 2009 పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇప్పటి వరకు మొత్తం 1,95,609 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 1145కు చేరింది. 2437 మంది కోలుకున్నారు. గురువారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 54,098 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1151 రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 31,04,542 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 1,95,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,65,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1145 మంది మృత్యువాతపడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 28,620 ఉండగా ప్రస్తుతం గృహ, ఇతర సంస్థలలో 23,372 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా మరణాల రేటు రాష్ట్ర స్థాయిలో 0.58 శాతం ఉండగా జాతీయ స్థాయిలో1.6 శాతం నమోదైంది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారి రేటు రాష్ట్ర స్థాయిలో 84.78 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 83.5 శాతంగా ఉన్నది.
జిల్లాల వారీగా కొత్త కరోనా పాజిటివ్‌లు
గురువారం నాడు ఆదిలాబాద్‌లో 18, భద్రాద్రి-కొత్తగూడెంలో 77, జిహెచ్‌ఎంసిలో 293, జగిత్యాలలో 32, జనగామలో 26, జయశంకర్ భూపాల్‌పల్లిలో 23, జోగులాంబ గద్వాల్‌లో 25, కామారెడ్డిలో 63, కరీంనగర్‌లో 114, ఖమ్మంలో 104, కొమురంబీమ్ ఆసిఫాబాద్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 31, మహబూబాబాద్‌లో 43, మంచిర్యాలలో 33, మెదక్‌లో27, మేడ్చల్-మల్కాజిగిరిలో 173, ములుగులో19, నాగర్‌కర్నూల్‌లో 40, నల్లగొండలో 109, నారాయణపేట్‌లో 8, నిర్మల్‌లో 26, నిజామాబాద్‌లో 63, పెద్దపల్లిలో 29, రాజన్న సిరిసిల్లాలో 52, రంగారెడ్డిలో 171, సంగారెడ్డిలో 55, సిద్దిపేటలో 60, సూర్యాపేటలో 77, వికారాబాద్‌లో 23,వనపర్తిలో 39, వరంగల్ రూరల్‌లో 31,వరంగల్ అర్బన్‌లో 72, యాదాద్రి-భువనగిరిలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1,95,609 కేసులు
RELATED ARTICLES