మెల్‌బోర్న్: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ చేరిన భారత్.. మరో నామమాత్రపు పోరుకు సిద్ధమైంది. శనివారం శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇక రెండు వరుస ఓటములతో లంక సెమీస్ రేసు నుంచి తప్పుకోగా.. భారత్‌తో నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌కు ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గెలిచి మూడు మ్యాచ్‌ల్లో భారత్ స్వల్ప స్కోర్లే చేసి బౌలింగ్ బలంతో గట్టెక్కింది. విజయాలతో హ్యాట్రిక్ విజయాలందుకున్నా.. కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో నిలకడలేమితో ఇబ్బందిపడ్డ టీమిండియా.. భారీ స్కోర్లు చేయలేకపోయింది. ఓపెనర్లు స్మృతి, షెఫాలీ మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నా.. మిడిలార్డర్ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. లంకతో మ్యాచ్ ఎలా ఆడినా.. సెమీస్‌లో మెరుగైన బ్యాటింగ్ చేయడం అవసరం. లేకుంటే మరోసారి భంగపాటు తప్పదు. మ్యాచ్‌లో 132 పరుగులే చేసి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత మహిళలు, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 142 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక గురువారం న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌లో 133 పరుగులే చేసి ఉత్కంఠపోరులో చివరి బంతికి గెలుపొందింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్ షెఫాలీ మెరిసినా టీమిండియా తక్కువ స్కోర్లే చేసింది. బౌలర్లు సమష్టిగా చెలరేగి జట్టుకు విజయాల్ని అందించారు. స్మృతి మంధాన, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్, వేదాకృష్ణమూర్తి లాంటి సీనియర్లు భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. ఈ ముగ్గురూ ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. శ్రీలంకతో మ్యాచ్ నామమాత్రమే కావున భారత బ్యాటర్లు స్వేచ్ఛగా చెలరేగాలి. ఇక్కడ రాణిస్తే.. సెమీస్, ఫైనల్లో మెరిసే అవకాశముంటుంది. లేదంటే గత ప్రపంచకప్ మాదిరి ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవ చ్చు. సంబంధం లేకుండా భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సమష్టిగా చెలరేగుతూ స్పల్ప స్కోర్లను కూడా కాపాడుతున్నా రు. స్పిన్నర్లు పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రత్యర్థులను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. వీరికి తోడు పేసర్ శిఖా పాండే కూడా అండగా నిలుస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. మిగతా మ్యాచ్‌ల్లోనూ వీరు జోరు ఇలాగే కొనసాగితే భారత మహిళలు తమ కలను సాకారం అవుతోంది. ప్రత్యర్థి జట్టులో కెప్టెన్ ఆటపట్టు మినహా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. ఫలితంగా రెండు మ్యాచ్‌లు ఓడి నాకౌట్ రేసు నుంచి తప్పుకున్నారు. భారత్ -శ్రీలంక మ్యాచ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్‌లో ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తీ శర్మ, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ పూనమ్ యాదవ్
శ్రీలంక: హాసిని పెరెరా, చమరి ఆటపట్టు, ఉమేశా, అనుష్క సంజీవని, నీలాక్షి డి సిల్వా, అమ కంచన, శశికళ సిరి వర్ధనే, హర్షిత మాద్వి, కవిష డిల్‌హరి, సుగందిక కుమారి, ఉదేశిక ప్రబోధని
RELATED ARTICLES