1,891 కేసులు10 మరణాలు

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తి
66,677కు చేరిన పాజిటివ్‌ కేసులు
మహమ్మారి కాటుకు 540 మంది బలి
ప్రజాపక్షం/ హైదరాబాద్‌
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతో పాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 1891 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య మొత్తం 66,677కు చేరింది. 10 మంది మరణించగా ఇప్పటి వరకు 540 మంది మృతి చెందారు. ఒక్కరోజే 19,202 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 1656 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఈ మేరకు శనివారం (సాయంత్రం 8 గంటల నాటికి ) కరోనా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని 1088 డిశ్చార్జ్‌ కాగా, మొత్తం గా 47,590 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 18,547 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హోమ్‌, ఇనిస్టిట్యూషనల్‌, ఐసోలేషన్‌లో 12,001 మంది ఉన్నారు. ఇతర వ్యాధులతో మరణించినవారు 53.87 శాతం, కరోనాతో మరణించినవారు 46.13 శాతం మంది ఉన్నారు. అలాగే ప్రభుత్వఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ బెడ్స్‌ 11,099, ఆక్సిజన్‌ బెడ్స్‌ 3365, ఐసియు బెడ్స్‌ 1346, మొత్తం 15,810 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 16 ప్రభుత్వ ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష కేంద్రాలు ఉండగా, 23 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. 320 ప్రభుత్వ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కరోనా సోకిన వారిలో పురుషులు 65.6 శాతం, మహిళలు 34.4 శాతం మంది ఉన్నారు. వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా 31 ఏళ్ల వయస్సు వారే 25 శాతం ఉండగా, 21- ఏళ్ల వారు 22.1 శాతం, 41- ఏళ్ల వయసు ఉన్న వారిలో 18.6 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,77,795 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో మరణాల శాతం 0.80 నమోదు కాగా, జాతీయ స్థాయిలో 2.15 శాతంగా ఉన్నది. తాజాగా జిహెచ్‌ఎంసిలో 517, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌- మల్కాజిగిరిలో 146, వరంగల్‌ అర్బన్‌లో 138, నిజామాబాద్‌లో 131, సంగారెడ్డిలో 111, కరీంనగర్‌లో 93 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. టెలిమెడిసిన్‌, లేదా ఇతర సమస్యలేమైనా ఉంటే 104 నంబర్‌కు, ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్‌కు ఫోన్‌ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లాల వారీగా కరోనా లెక్కలు:
శనివారం ఒక్క రోజే ఆదిలాబాద్‌లో 19, భద్రాచలం -కొత్తగూడెంలో 32, జిహెచ్‌ఎంసిలో 517, జగిత్యాలలో 14, జనగాంలో 15, జయశంకర్‌ భూపాల్‌పల్లిలో 0. జోగులాంబ గద్వాల్‌లో 38, కామారెడ్డిలో 42, కరీంనగర్‌లో 93, ఖమ్మంలో 47, కొమురంబీమ్‌ ఆసిఫాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 33, మహబూబాబాద్‌లో 24, మంచిర్యాలలో 28, మెదక్‌లో 21, మేడ్చల్‌- మల్కాజిగిరిలో 146, ములుగులో 11, నాగర్‌కర్నూల్‌లో 1, నల్లగొండలో 46, నారాయణపేట్‌లో11, నిర్మల్‌లో 8, నిజామాబాద్‌లో 131,పెద్దపల్లిలో 37, రాజన్న సిరిసిల్లలో28, రంగారెడ్డిలో181, సంగారెడ్డిలో 111, సిద్దిపేటలో 27, సూర్యాపేటలో 35, వికారాబాద్‌లో 8, వనపర్తిలో 13, వరంగల్‌ రూరల్‌లో 22, వరంగల్‌ అర్బన్‌లో 138, యాదాద్రి-భువనగిరిలో 12 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?