రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మోడీపై చర్య తీసుకోవాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ
కన్హయ్య కుమార్‌ సభకు అనుమతి నిరాకరించడంపై చాడ ఆగ్రహం
కెసిఆర్‌ ప్రభుత్వంలో పెరిగిన నిర్బంధాలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాని కి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యద ర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్య ద్‌ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ డి.సుధాకర్‌, హైదరాబాద్‌ కార్యదర్శి ఇ.టి.నర్సింహతో కలిసి హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో సోమవారం నారాయణ మాట్లాడా రు. సిఎఎకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై చర్య తీసుకుంటామని గవర్న ర్‌ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సిఎఎను తెచ్చిన మోడీ ప్రభుత్వంపై తీసుకోవాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్ర భు త్వం, తెలుగు రాష్ట్రాల్లోని కెసిఆర్‌, జగన్‌ ప్రభుత్వాలు న యా నియంతృత్వ ధోరణులను అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌లో విదేశీ బృందాన్ని అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని జాతీయ రాజకీయ పార్టీల పర్యటనకు ఎందుకు అనుమతించడం లేదని ప్ర శ్నించారు. ఇప్పటికి మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు గృహ నిర్బంధాల్లో ఉన్నారని, బిజెపి మత వి వక్షతతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌ను ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా జాతీయ స్థాయిలో ఒకే వేదికపైకి రాలేక పోతున్నాయని చెప్పారు. బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున డిటెన్షన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎంఐఎం టిఆర్‌ఎస్‌, బి జెపిలు అనుకూలమని అందుకే బీహార్‌, మహారాష్ట్ర లో బిజెపిని గెలిపించేందుకు ఎంఐఎం పోటీ చేసిందన్నారు.
ఎపి, తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఖూనీ : ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంద ని నారాయణ ఆరోపించారు. ఎపి రాజధానికి అమరావ తే ఉండాలన్నారు. అమరావతి రాజధానిని ప్రతిపక్ష నేత గా ఆమోదించిన జగన్‌, ఇప్పుడు వ్యతిరేకించడం తగదన్నారు. మూడు రాజధానుల పేరిట అన్ని ప్రాంతాల్లో అ లజడులు సృష్టించారని విమర్శించారు. తల ఒక చోట , మొండెం మరో చోట ఎలా ఉంటుందన్నారు. అమరావతిలో 12 వేల ఎకరాలు మిగిలి ఉందని, ఆ భూమిని ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఎపిలో మిలటరీ పాలన సాగుతోందన్నారు. సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ ఎంఐఎం సభలకు అనుమతిస్తూ కన్హయ్య కుమార్‌ సభకు అనుమతించక పోవడం చూస్తే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదని అన్నారు . కోర్టు అనుమతితో మిలీనియం మార్చ్‌ నిర్వహిస్తే ని ర్వాహకులు, ఇతరులపై కేసులు నమోదు చేశారని వి మర్శించారు. ఇటి నరసింహ మాట్లాడుతూ కన్హయ్య కు మార్‌ సభకోసం ఖిల్వత్‌ గ్రౌండ్‌, క్రిస్టల్‌ గార్డెన్‌లలో ఏదో ఒక చోట అనుమతివ్వాలని కోరామని అయినా ఎక్కడా అనుమతించలేదని తెలిపారు. ఇండోర్‌ సమావేశాలకు పోలీసుల అనుమతి అవసరం లేకపోయినా క్రిస్టెల్‌ గార్డె న్‌ యాజమాన్యానికి పోలీసులు బెదిరించారని, పోలీసు అనుమతి లేనిదే సభకు అనుమతివ్వరాదన్నారని తెలిపా రు. కేంద్రంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు కెసిఆర్‌ అ మలు చేస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు మతపర శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో నిర్బంధాలు పెరిగిపోయాయి : చాడ
సిఎఎ, ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా దేశవ్యాప్తం గా అల్లకల్లోలం కొనసాగుతోందని చాడ వెంకట్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం వ్యతిరేక ఆందోళనలను అణిచివేస్తోందన్నారు. బుధవా రం కన్హయ్య కుమార్‌ ఇండోర్‌ మీటింగ్‌కు కూడా పోలీసులు అనుమతించలేదని, ఇది ప్రభుత్వ అణచివేత చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. క్రిస్టల్‌ గార్డెన్‌లో తలపెట్టిన ఈసమావేశానికి పోలీసులు అనుమతించక పోవ డం దారుణమన్నారు. ఎంఐఎం సభలు, ర్యాలీలకు అనుమతిస్తున్న పోలీసులు వామపక్షాల నిరసన కార్యక్రమాలకు అనుమతించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంఐఎంకు ఒక చట్టం ప్రతిపక్షాలకు ఒక చట్టమా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలపై రాష్ట్ర ప్రభుత్వ అణచివేత వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదే విధా నం కొనసాగిస్తే టిఆర్‌ఎస్‌ పార్టీకి పుట్టగతులుండవని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, కన్హ య్య కుమరా సభకు కోర్టు ద్వారా అనుమతి తీసుకోనైనా సభ నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే వ్యక్తులనే ఎన్నుకోవాలని చాడ వెంకట్‌ రెడ్డి ప్రజలను కోరారు. బిజెపిని ఓడించడమే ధ్యే యంగా సిపిఐ, వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పోటీ చేస్తుందన్నారు. పండుగ సమయంలో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?