ప్రభుత్వ శాఖలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశా
మరో ఎత్తుగడ అని కాంగ్రెస్ విమర్శ
న్యూఢిల్లీ: రాబోయే 18 నెలల కాలం లో పది లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేవాలు కూడా జారీ చేశారు. నిరుద్యోగులకు ఇది తీపికబురుగా బిజెపి వర్గాలు ప్రశంసిస్తుండగా, దీని ని మరో ఎత్తుగడగా కాంగ్రెస్ అభివర్ణించింది. కాగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిని ప్రధాని సమీక్షించా రు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా అన్ని శాఖలకు ప్రధాని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? అనే వివరాలు ఇంకా
18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు
తెలియరాలేదు. అయితే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబిపిఎస్), రైల్వే ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బి) ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. వీటితో పాటు ఆయా ప్రభుత్వ శాఖలు కూడా వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. రైల్వే ఉద్యోగం, బ్యాంకు ఉద్యోగం, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష వేర్వేరుగా కాకుండా ఒకే పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీ విధానం ఉపయోగపడుతుంది. ఈ ఏజెన్సీ వివిధ శాఖల్లో నియామకాల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)ను ఇప్పటికే నిర్వహించి ఉండాల్సింది. కానీ, కరోనా కారణంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు అదే ఏజెన్సీ ఆధ్వర్యంలో సెట్ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.ఇలావుంటే, ఏడాదిన్నర కాలంలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాని ప్రకటించడం మరో ఎత్తుగడగా కాంగ్రెస్ పేర్కొంది. ఎంతకాలం ఇలాంటి ఎత్తుగడలు, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెడతారంటూ నిలదీసింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని విస్మరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సర్జేవాలా విమర్శించారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, ప్రధాని కేవలం పది లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేశారని గర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు
RELATED ARTICLES