అహ్మదాబాద్ : 2002 గుజరాత్ అల్లర్ల దాడుల సమయంలో సామూహిక అత్యాచారానికి గురయి ప్రాణాలతో బయటపడిన బిల్‌కీస్ బానోకి అందాల్సిన రూ. 50 లక్షల పరిహారాన్ని రెండు వారాల్లో అందిస్తామని తెలిపిన గుజరాత్ ప్రభుత్వాన్ని బిల్‌కీస్ బానో భర్త తప్పుపట్టారు. బాధితురాలుకు విజయ్ రూపానీ ప్రభుత్వం ఎలాంటి సహాయం ఇంతవరకూ అందించక నిర్లక్ష్యం వహిస్తోందంటూ బానో భర్త యాకూబ్ రసూల్ విమర్శించారు. అత్యాచారం జరిగి 17యేళ్లు అయినా బాధితురాలికి సహాయాన్ని అందించడంలో గుజరాత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బాధితులరాలికి రూ. 50 లక్షల పరిహారం అందించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధితురాలికి 15రోజుల్లో పరిహారాన్ని అందించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 13న ప్రభుత్వాన్ని కోరి ఐదునెలలు గడిచినా ఇంతవరకూ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఒక్కసారి కూడా ఈ విషయంలో ప్రభుత్వం తమతో సంప్రదించలేదన్నారు. ఇప్పటికే తమ కుటుంబం ఈ విషయంలో విజయ్ రూపానీ ప్రభుత్వానికి రెండు సార్లు నోటీసులు పంపించామన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 15 రోజుల్లో పరిహారం అందించాలన్న కోర్టు ఉత్వర్వులను పక్కన పె ట్టడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. సా మూహిక అత్యాచారంలో బిల్‌కీస్ బానో సర్వం కోల్పోయారని, 17 యేళ్లుగా పరిహారం కోసం, న్యాయం కో సం పోరాటం చేస్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని యాకూబ్ రసూల్ మండిపడ్డారు. దీంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. సోమవారం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంతో కూడిన ధర్నాసనం ఈ విషయంపై గుజరాత్ ప్ర భుత్వాన్ని ప్రశ్నించింది. ఎందుకు బాధితురాలుకు పరిహారం, ఉద్యోగం కల్పించడం లేదని అడిగింది. సోలిసిటర్ జనరల్ తుషార్ గుప్తా బదులిస్తూ.. రెండు వారాల్లో దీనికి సంబంధించిన అంశాన్ని పూర్తి చేస్తామన్నారు. 2002 మార్చి 3న బిలికీస్ బ్యానో కుటుంబంపై అహ్మదాబాద్ సమీపంలోని రాన్‌దిక్ పూర్ గ్రామంలో మూక దాడి జరిగింది. గోద్రా అల్లర్ల అనంతరం ఈ ఘటన చో టు చేసుకుంది. దాడి జరిగిన సమయంలో బిల్‌కీస్ బ్యానో ఐదునెలల గర్భవతి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె ఏడుగురు కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.
17 యేళ్లుగా పోరాటం… పట్టని ప్రభుత్వం
RELATED ARTICLES