రెండురోజుల కార్యాచరణకు అఖిలపక్షం నిర్ణయం
ఎంఎల్‌ఎలు, ఎంపిలను కలిసి మద్దతు కోరాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయం
నేడు కార్మికుల మౌనదీక్షలు
కార్మికుల ఆందోళనలతో దద్దరిల్లుతున్న డిపోలు, బస్‌స్టేషన్లు
గుండెపోటుతో ఇద్దరు కార్మికులు మృతి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు చేపట్టి నిరవధిక సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. అన్ని డిపోలు, బస్‌ స్టేషన్లు ఆర్‌టిసి కార్మికుల ధర్నాలు, ప్రదర్శనలతో దద్ధరిల్లుతున్నాయి. ఆర్‌టిసి ప్రయాణికులు కూడా కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. సమ్మెను మరింత విస్తృతం చేసేందుకు మరోసారి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతును కూడగట్టాలని జెఎసి నిర్ణయించింది. సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు తమంతట తామే ఉద్యోగాల నుంచి డిస్మస్‌ చేసుకున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటన చేయడంతో కార్మికులు మానసిక క్షోభకు గురవుతున్నారు. కొంత మంది కార్మికులు మనస్తాపానికి గురై మృత్యువాతపడుతున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా ఆర్‌టిసిలో పనిచేస్తున్న హెచ్‌సియు డిపో డ్రైవర్‌ ఖలీల్‌, చెంగిచెర్ల డిపోకు చెందిన కొమురయ్య ప్రస్తుత పరిస్థితిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించినట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్‌టిసికి సంబంధించిన వేలాది బస్సులు నడవకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆర్‌టిసి, రవాణా శాఖ నడుపుతున్న అరకొర బస్సులు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. దసరా సెలవులు ముగుస్తుండడంతో పలు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమ గ్రామాల నుంచి తిరుగు ప్రయాణం కాగా వారిని ప్రైవేటు వాహనదారులు దోపిడీ చేస్తున్నారు. ఆర్‌టిసి సైతం ప్రైవేటు డ్రైవర్లతో ఆర్డినరీ బస్సులను వందల కిలోమీటర్ల దూరానికి నడుపుతున్నదని, గంటల తరబడి తాము డిక్కు సీట్లలో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు చెప్పారు. పైగా ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ బస్సుల చార్జీలను వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఇక బుధవారం రవాణా శాఖ మంత్రి

DO YOU LIKE THIS ARTICLE?