టి నుంచి ఆర్టికల్ 370 పిటిషన్లపై
రాజ్యాంగ ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ర ద్దు చేయడం, తదితర అంశాలపై దాఖలైన అనే క పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం రా జ్యాంగ ధర్మాసనానికి అప్పజెప్పింది. వాటిని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి విచారించనున్నది. కశ్మీర్‌లో పాత్రికేయుల కదిలకలపై ఆంక్షలు విధించడం, మైనర్లను అక్రమంగా నిర్బంధించడం సహా వివిధ అంశాలపై లేవనెత్తిన విషయాలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి సారథ్యం న్యాయమూర్తి ఎన్‌వి రమణ వహిస్తుండగా, ఇతర న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఆర్ సుభాష్ రెడ్డి, బిఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉండనున్నారు. ఆర్టికల్ 370 రద్దు, అలాగే జమ్మూకశ్మీర్, లడఖ్‌ల ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
RELATED ARTICLES