HomeNewsBreaking News16న పాలమూరు-రంగారెడ్డివెట్న్‌ ప్రారంభం

16న పాలమూరు-రంగారెడ్డివెట్న్‌ ప్రారంభం

నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ఛాన్‌చేసి షురూ చేయనున్న సిఎం కెసిఆర్‌
ప్రజలు సంబరాలు జరుపుకోవాలని సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్‌
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ఈనెల 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ నుండి బటన్‌ నొక్కి, బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సిఎం కెసిఆర్‌ ఎత్తిపోయనున్నారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని, ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైన మరుసటి రోజు (సెప్టెంబర్‌ 17 న) ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో పెద్ద ఎత్తున సంబురాలను జరుపుకోవాలని సూచించారు. ప్రారంభానికి పల్లె పల్లెన సర్పంచులు, ప్రజలు తమ వెంట కలషాలను తెచ్చుకుని, ఆ కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలకు అభిషేకించి, మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఎత్తిపోతల ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చనున్నదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సిఎం వెల్లడించారు. ఈ సభకు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లెనుంచి సర్పంచులు, గ్రామస్థులు హాజరుకావాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపైన ముఖ్యమంత్రి కెసిఆర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సిఎం సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వల తవ్వకం, అందుకు సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్‌ ప్లో వద్ద) నార్లాపూర్‌ వద్ద నిర్మించిన ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ఛాన్‌ చేసి పంపులను ప్రారంభిస్తారు. వెట్న్‌ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌ కు చేరుకోనున్నాయి. మోటర్లు ఆన్‌ చేసిన వెంటనే సిఎం కెసిఆర్‌ నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని రిజర్వాయర్‌ కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పల్లెలనుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లకు సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీల్లను తరలించే కాల్వల నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో అనుసరించిన పద్దతులనే అనుసరించాలన్నారు. అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిథిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులకు సంబంధించి మహేశ్వరం ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో మంత్రులు ఇరిగేషన్‌ అధికారులతో కలిసి పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను యుద్దప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో వున్నదని సిఎం పునరుద్ఘాటించారు. తద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు.
240 టన్నుల బరువుతో 50 పంపులు
ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్‌ పంపులను పాలమూరు ఎత్తిపోతలకు వినియోగిస్తున్నామని ఇంజనీర్లు సిఎంకు వివరించారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువు 12 కిలోలుంటుందనీ, దీని రూటర్‌ 80 టన్నులు ఉంటుందన్నారు. 240 టన్నుల బరువుండే దాదాపు 50 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నామని ఇంజనీర్లు వివరించారు. అనంతరం సిఎం సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాడార్‌లో వచ్చే చెరువులను నింపే దిశగా అనుసంధానిస్తే కాల్వల పనులను చేపట్టాలన్నారు. నీటిని ఎత్తిపోసేందుకు పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్‌ వ్యవస్థల నిర్మాణంపై జెన్‌కో, ట్రాన్స్‌ కో సిఎండీ ప్రభాకర్‌ రావు తదితర విద్యుత్‌ శాఖ అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. తాగునీరు తరలింపునకు చేపట్టాల్సిన చర్యలపై మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌ రెడ్డి తదితర అధికారులతో సిఎం సమీక్షించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments