సెమీస్‌లో చెన్ యు ఫీపై గెలుపు
మూడోసారి ఫైనల్లో అడుగు పెట్టిన భారత షెట్లర్
బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్-2019
బాసెల్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. జరిగిన సెమీస్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనా క్రీడాకారిణి చెన్ యు ఫీతో జరిగిన మ్యాచ్‌లో 21-7, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ఫలితంగా వరల్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. కేవలం 39 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ప్రత్యర్ధిని చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు నాలుగు పతకాలు గెలిచిన సింధు… స్వర్ణం మాత్రం నెగ్గలేదు. అయితే, ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకాన్ని గెలవాలి ఉవ్విళ్లూరుతోంది.
పసిడి పోరుకు సింధు
RELATED ARTICLES