రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందిస్తామన్న కేంద్రం
న్యూఢిల్లీ : రాబోయే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల కొవిడ్ టీకా డోస్‌లను ఉచితంగా అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈనెలాఖరులోగా వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకూ చేరుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. వీటిలో వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మే 16 నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు. కోటి 62 లక్షల కొవిషీల్, 29 లక్షల 49 వేల కొవాగ్జిన్ డోస్‌లు ఉంటాయని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సిన్లను వినియోగిస్తున్న తీరును పరిశీలించడంతోపాటు, రెండో డోస్‌లు అవసరమైన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకొని కేటాయింపులు జరుగుతాయని వివరించారు. ఈనెలలో ఇంత వరకూ 1.70 కోట్ల డోస్‌లను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. పంపిణీకి సంబంధించిన వివరాలను అందరితోనూ ముందుగానే పంచుకుంటామని, దీనివల్ల ఆయా ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని జవడేకర్ చెప్పారు. వ్యాక్సిన్ల సక్రమ వినియోగం కూడా అత్యవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ డోస్‌లను
45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తారని గుర్తుచేశారు. వ్యాక్సిన్లను నేరుగా తయారీదారుల నుంచే కొనుగోలు చేసేందుకు అన్ని ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతి జారీ చేశామని అన్నారు. ఈనెలలో మార్కెట్‌లో 4.39 కోట్ల డోస్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఇండియాకు 5 కోట్ల ఫైజర్ టీకాలు..
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ 5 కోట్ల టీకాలను భారత్‌కు అమ్మే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వంతో ఆ సంస్థ ఈ విషయంపై చర్చిస్తున్నది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అవుతాయని సమాచారం. ప్రస్తుత మార్కెట్‌లో ఫైజర్ వ్యాక్సిన్ ధర మిగతా వాటి కంటే ఎక్కువగా ఉన్నది. అయితే కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఫైజర్ టీకాలను కొనుగోలు చేయాలని చూస్తున్నదని అంటున్నారు.
15 రోజుల్లో 1.92 కోట్ల డోస్‌లు
RELATED ARTICLES