ప్రజాపక్షం/హైదరాబాద్ వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పది పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.
టెన్త్ హాల్‌టికెట్లు విడుదల : పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ గురువారం విడుదల చేసింది. హాల్‌టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్(bse.telangana.gov.in) లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను పొందవచ్చునని ప్రకటించింది. కాగా ఈ నెల 18 నుండి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదోతరగతి పరీక్షలు జరనున్న విషయం తెలిపిందే. అయితే సైన్స్ విషయంలో రెండు భాగాలుగా పరీక్ష జరగనున్న నేపథ్యంలో పార్ట్ 1 ఫిజికల్ సైన్స్, పార్ట్ 2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు.
15 నుంచి ఒంటిపూట బడులు
RELATED ARTICLES