న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వడగాల్పులు వేధిస్తున్న తరుణంలో నైరుతీ రుతుపవనాలు ఈనెల 15వ తేదీ నాటికే భారత్‌ను తాకనున్నాయన్న వార్త అందరికీ ఊరటనిస్తున్నది. రుతుపవనాలు అనుకున్నదాని కంటే కొంత ముందుగానే రానున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటిచింది. తొలుత ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని, తత్ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుదయ్యే అవకాశం ఉందని వివరించింది. సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ ఒకటో తేదీన ప్రవేశిస్తాయి. అయితే, ఈసారి ముందుగానే రానున్నట్టు ఐఎండి తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సగటున కురిసే వర్షపాతంలో 96 నుంచి 104 శాతం వరకూ ఈసారి వర్షంపాతం ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, మధ్య భారత దేశంలో సాధారణం లేదా అంతకంటే కొంత ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, వాయువ్య, దక్షిణ భారత దేశంలో సాధారంం కంటే తక్కువగా వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసింది.
15న దేశంలోకి… నైరుతీ రుతుపవనాల రాక
RELATED ARTICLES