రాష్ట్రంలో చెలరేగుతున్న కరోనా వైరస్
మరో ఏడుగురు కొవిడ్‌కు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ 19 విశృంఖలంగా వ్యాప్తి చెందుతోంది. గ్రేటర్ హైదరాబాద్, పరిసర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యం గా జిహెచ్‌ఎంసితోపాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఎక్కువగా ప్రబలుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,430 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కొత్తగా మరో ఏడుగురు కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 422కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవా రం 703 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 117, వరంగల్ అర్బన్ జిల్లాలో 34 కేసులు, మేడ్చల్ జిల్లా లో 105 కేసులు రికార్డయ్యాయి. కామారెడ్డిలో 43 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ రూరల్‌లో 20 కేసులు బయటపడ్డాయి. అలాగే, కరీంనగర్ జిల్లాలో 27 కేసులు, నల్లగొండలో 45 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 50 కేసులు, మెదక్ జిల్లాలో 26, సిద్దిపేట జిల్లాలో 14, వికారాబాద్ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా, ఖమ్మంలో 14, మహబూబ్‌నగర్ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 27, జనగామ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 48 కేసులు, రాజన్న సిరిసిల్లలో 8 కేసులు, జోగులాంబ గద్వాల 4, బద్రాద్రి కొత్తగూడెంలో 5, జయశంకర్ భూపాలపల్లి 27 కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 18 కేసులు, మంచిర్యాలలో 5 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలో 4, యాదాద్రి భువనగిరిలో 9, నిర్మల్‌లో 1, ఆదిలాబాద్‌లో 7, జగిత్యాలలో 18 కేసులు రికార్డయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 10,891 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 36,385 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారంనాడు రికార్డు స్థాయిలో ఒకేరోజు 2,062 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 16,855 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, ఇప్పటివరకు మొత్తం 2,93,077 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
1430 కొత్త కేసులు
RELATED ARTICLES