14 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020 సంబంధించిన వా ర్షిక బడ్జెట్ కసరత్తులను త్వరలో ప్రారంభించనుంది. నెమ్మదించిన వృద్ధిరేటు, తగ్గిన ఆదాయం సేకరణ సహా అనేక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను తయారు చేయనుంది. ఈ ప్రక్రియ అక్టోబరు 14నుంచి ప్రారంభమవుతుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది మోడీ రెండో ప్రభుత్వానికి, అలాగే ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌గా రెండోసారి. ముందస్తు బడ్జెట్ అంచనాలకు సం బంధించిన సమావేశాలు అక్టోబరు 14, 2019 నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక సలహాదారులు తమ ప్రణాళికలతో( యూనియన్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం కు చెందిన రివైజ్డ్ ఎస్టిమేషన్ మాడ్యూల్తో) ఈ స మావేశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. నవంబరు మొదటివారం వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి కూడా వచ్చే ఏ డాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ఆమోదించడం అన్నది మూడు దశలుగా ఉంటుంది. ఇది మే నెల మధ్యలో పూర్తికానున్నద ని సమాచారం. ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ శాఖలు ప్రాజెక్టులకు ఖర్చు చేయ డం ఆరంభించేందుకు ఈ బడ్జెట్‌ను ఉద్దేశించారు.