ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసిన మరో దారుణ ఘటన
లఖీంపూర్ ఖేరి/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాలిక నాలుక, కళ్ళపై తీవ్ర గాయాలైనట్లు వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. అత్యాచారం తరువాత గొంతు కోసి చంపడం వల్లనే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. రాష్ట్రం లో శాంతిభద్రతలపై కాంగ్రెస్, ఎస్‌పి నాయకులు ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక శుక్రవారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వెళ్లింది. గంటలు గడుస్తున్నా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బాలికకోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఇదేసమయంలో కూతురు కనిపించడంలేదని బాలిక తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. చివరకు గ్రామ సమీపంలోని ఓ చెరకుపొలంలో అత్యంత దారుణ స్థితిలో ఆ బాలిక మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ధౌరహ్రా డిఎస్‌పి అభిషేక్ ప్రతాప్ చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సంజయ్, సంతోష్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశామన్నారు. వారిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, ఎస్‌సి, ఎస్‌టి చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. బాలిక కళ్ళకు, నాలుకకు గాయాల గురించి ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, వైద్యుల బృందం నిర్వహించిన పోస్టుమార్టంలో అలాంటిదేమీ లేదని ఆయన అన్నారు. ‘అత్యాచారం తరువాత గొంతు కోసి చంపడమే బాలిక మరణానికి కారణమని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది’ అని చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ ఘటన మానవత్వాన్ని కదిలించిందని అన్నారు. ‘యుపిలోని లఖీంపూర్ ఖేరిలో ఒక టీనేజ్ బాలికపై అత్యాచారం, హత్య మానవాళిని కదిలించింది. బిజెపి పాలనలో, పిల్లలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి.’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘అత్యాచారం, కిడ్నాప్, హత్య, ఇతర నేరాలకు పాల్పడిన వారిని బిజెపి ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది’ అని అఖిలేష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద ఆదివారం మాట్లాడుతూ, ‘ బాలిక హత్యాచారం ఘటన అమానవీయమైన చర్య మానవాళిని సిగ్గుపడేలా చేసింది. ఇది చాలా విచారకరమైన సంఘటన. ఈ ఎపిసోడ్‌లో పోలీసులు మరింత కఠినంగా ఉండాలి. అది నేరస్థులకు నిరోధకంగా మారుతుంది’ అని అన్నారు. హిందీలో ట్వీట్ చేసిన ప్రసాద.. ‘ఇంత పెద్ద ఘటన జరిగితే పోలీసులు ఏమి చేస్తున్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలి. కుటుంబ భద్రత (బాలిక)ను పరిశీలించాలి’ అని ప్రశ్నించారు. ఈ సంఘటన చాలా విచారకరం, సిగ్గుచేటు అని పేర్కొన్న బిఎస్‌పి అధినేత మాయావతి.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎస్‌పి ప్రభుత్వానికి, ప్రస్తుత బిజెపి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటి? లఖీంపూర్ ఖేరి, అజమ్‌గఢ్ ఘటనల్లో దోషులపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి కోరుతోంది’ అని ఆమె అన్నారు ట్వీట్. అజమ్‌గఢ్‌లో ఇటీవల ఒక గ్రామపెద్ద హత్యకు గురయ్యాడు.
13 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
RELATED ARTICLES