నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల13న అసెంబ్లీ సమావేశం ఉదయం 11:30గంటలకు, శాసనమండలి సమావేశం 14న ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుంది. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) చట్టాల్లో కొన్ని సవరణలను ప్రభుత్వం చేయనున్నది. మరోవైపు ఇటీవల పాలనాపరమైన విషయాలలో హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాలను చట్టాలు చేయాల్సి ఉంది. పలు చట్టాల సవరణ కోసం అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
13న శాసనసభ, 14న శాసనమండలి
RELATED ARTICLES