HomeNewsBreaking News125 అడుగులు అంబేద్కర్‌ విగ్రహానికి‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌'లో చోటు

125 అడుగులు అంబేద్కర్‌ విగ్రహానికి‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’లో చోటు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించినందుకు గా ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’లో కొత్త గా ఆవిష్కరించిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం నమోదైంది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేరుతో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అందించారు. హైరెంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం స్థానం పొందటం పట్ల మంత్రి కొప్పుల ఆనందం వ్యక్తం చేశారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేడ్కర్‌ విగ్రహం ఒక టూరిజం స్పాట్‌గా మారుతుందని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, న్యూమరాలజిస్ట్‌ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌, హైరేంజ్‌ బుక్‌ ఆప్‌ వరల్డ్‌ రికార్డ్‌ డైరెక్టర్స్‌ శ్రీకాంత్‌, సుమన్‌ పల్లె తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments