ముంబయిలో కుప్పకూలిన భవనం
శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు అనుమానం
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మరో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ముంబయిలోని డోంగ్రి ప్రాంతంలో మంగళవారం నాలుగు అంతస్థులు ఉన్న ఓ నివాసిత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది దుర్మర ణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు మున్సిపల్ అధికారు లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్య లు ప్రారంభించాయి. డోంగ్రి ప్రాం తంలో ఇరుకుగా ఉండి ఎప్పుడూ సందడిగా ఉండే తండెల్ వీధిలోని కౌసర్‌బౌగ్ భవనం కూలిపోయినట్లు గృహ నిర్మాణశాఖమంత్రి రాధాకృష్ణ వైఖే పాటిల్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్లు ఓ బిఎంసి అధికారి వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు ముంబయి మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ పేర్కొన్నారు. సహాయక సిబ్బంది శిథిలాల తొలగిస్తుండగా దు స్తువుల బండిళ్లను చుట్టుకొని ఓ బాలుడిని బయటకు తీసిన దృశ్యాలను టివి చానెళ్ల ప్రసారం చేశాయి. అయితే ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవనం కుప్పకూలి న తరువాత బ్రిహణ్ ముంబయి కార్పొరేషన్ (బిఎంసి) ఇమామ్‌వాడ మున్సిపల్ సెకండరీ బాలికల పాఠశాలలో ఒక శిబిరాన్ని ప్రారంభించినట్లు మున్సి ల్ అధికారి ఒకరు చెప్పారు. ముంబదేవి ఎంఎల్‌ఎ అమిన్ పటేల్ కూప్పకూలిన కూ లిన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతుందని, ఇంకా పది నుంచి 12 కుటుంబాలు శిథిలాల కింద ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామన్నారు. కాగా, కూలిపోయిన భవనం వందేళ్లనాటిదని, శిథిలమైన భవనాల జాబితాలో ఆ భవనం లేదని, భవనాన్ని పునరాభివృద్ధి కోసం ఇచ్చారని చెప్పా రు. కూలిన భవనంలో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తున్నట్లు సిఎం తెలిపారు. స్థానికులు ఈ భవనం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఎడిఎ)కి చెందినది అని చెబుతుండగా, ఎంహెచ్‌ఎడిఎ మర్మతులు బోర్డు చీఫ్ వినోద్ ఘోసల్కర్ మాత్రం ఆ భవనం హౌసింగ్ బాడికి చెందినదని కాదని చెప్పడం గమనార్హం.కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలతో ముంబయి నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా భవనాలు, గోడలు కూలిన పలు ఘటనల్లో దాదా పు 20మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రధాని సంతాపం
భవనం కూలిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు.
12 మంది సజీవసమాధి
RELATED ARTICLES