బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామి (111) సోమవారం ఉదయం 11.44 గంటల ప్రాంతంలో కన్నుమూశా రు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు చెన్నైలో కాలేయ శస్త్రచికిత్స జరిగింది. మొదట ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నట్లు కన్పించినప్పటికీ తర్వాత క్షీణించిందని డాక్టర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు తుమకూరు లో ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు మఠం నిర్వాహకులు ప్రకటించారు. కర్ణాటకలో మూడ్రోజులపాటు సంతా ప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు కూడా ప్రకటించారు. శివకుమారస్వామిని ‘నడిచే దేవుడి’గా ఆయన ఆరాధకులు పిలుచుకుంటారు. 12శతాబ్దంలోని సంఘసంస్కర్త బసవ రూపం లో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తుంటారు. లింగాయత్‌లకు ఆరాధకుడైన ఆయన సిద్దగంగ విద్యాపీఠానికి అధిపతిగానూ ఉన్నారు. శివకుమారస్వామి జీవితాంతం బ్రహ్మచారిగా జీవించారు. ఆయన పద్మభూషణ్, కర్ణాటక రత వంటి అవార్డులు అందుకున్నారు. సిద్దగంగ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగిస్తున్నారు.
111 ఏళ్ల మఠాధిపతి శివకుమారస్వామి కన్నుమూత
RELATED ARTICLES