న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 11న ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే రోజు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సభ్యుల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకురానున్నారు. సమావేశాలు ఈనెల 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు జరుగుతాయి. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందే జరిగే పూర్తిస్థాయి సమావేశాలు ఇవే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 11వ తేదీనే వెల్లడికానున్నాయి. అయితే యాధృచ్ఛికంగా పార్లమెంట్ సమావేశాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాగా, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు కూడా ఈనెల 10న అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తేనుంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఇటీవల ఒక ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు కూడా ఇదే చివరి అవకాశం. రాఫెల్ ఒప్పందం, వ్యవసాయ సంక్షోభం, సిబిఐ పనితీరు ఇతర అంశాలను ప్రతిపక్షాలు లెవనెత్తే అవకాశముంది.
11 లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష భేటీ
RELATED ARTICLES