రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసులు
891 ఒక్క రోజే నమోదైన కేసులు
ఆంధ్రప్రదేశ్‌నూ అధిగమించిన తెలంగాణ
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణలో కోవిడ్-19 కేసుల సంఖ్య పదివేల మార్కు దాటిం ది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 891 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ, కాగా ఐదు మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 10,444 కు చేరింది. మృతుల సంఖ్య 225కు పెరిగింది. 4,361 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 67,318 టెస్టులు నిర్వహించారు. కాగా, కరోనా పాజిటివ్ కేసుల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కూడా తెలంగాణ అధిగమించింది. ఎపిలో ఇప్పటి వరకు 10,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొట్టమొదటి కేసు మార్చి 2వ తేదీన నమోదైంది. లాక్‌డౌన్ సడలింపు తరువాత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచాక కేసులు కూడా పెరుగుతున్నాయి. సగటున టెస్టు చేసిన ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అవుతోంది. కాగా బుధవారం నాడు తెలంగాణలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జిహెచ్‌ఎంసిలో 719, రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 55 నమోదయ్యాయి. మిగతా కేసుల్లో సంగారెడ్డి-2, వరంగల్ రూరల్ -3, కామారెడ్డి-1, కరీంనగర్-2, ఖమ్మం – 4, సిద్ధిపేట- 1, భద్రాద్రి కొత్తగూడెం-6, సిరిసిల్ల -1, వరంగల్ అర్బన్ – 3, గద్వాల – 1, పెద్దపల్లి – 1, సూర్యాపేట- 1, నల్లగొండ- 2, నిజామాబాద్-1, మహబూబాబాద్ -1, ఆదిలాబాద్ – 1. టెస్టుల సంఖ్య పెంచినప్పటి నుండి గత వారం రోజులుగా రోజుకు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.