న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారం భం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయు డు ఈనెల 10వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎగువసభలో సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అఖిలపక్ష భేటీలో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురానున్నారు. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తేనుంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణనిస్తూ ఇటీవల ఒక ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈనెల 10వ తేదీన తన నివాసంలో రాజ్యసభ చైర్మన్ ఎగువసభలోని ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికా ర వర్గాలు పేర్కొన్నాయి. సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్షనేత గులామ్ నబీ ఆజాద్, సభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఇతర నాయకులు హాజరు కానున్నారు. బి-జెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ శీతాకాల సమావేశాలే ఆఖరి పూర్తిస్థాయి సమావేశాలు. సమావేశాలు ఫలప్రదంగా జరిగేందుకు తీవ్ర కృషి చేస్తోంది. అదే విధంగా సభలో ప్రభుత్వ వైఫలయ్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు కూడా ఇదే చివరి అవకాశం. అయితే సమావేశాల ప్రారంభం నాడే ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సభా కార్యక్రమాలపై తీవ్రంగా పడే అవకాశముంది.