ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
వరద బాధితులకు అందించే సహాయక చర్యలపై నివేదించండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్టంలో కురిసిన వర్షాలు, వరదల పరిస్థితులపై తాజా నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడున్న సమస్యలపై నివేదికతోపాటు వరదల సమస్యలపై భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలపై కూడా నివేదిక విడిగా ఇవ్వాలంది. ప్రభుత్వం సమర్పించిన నివేదికను చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన
డివిజన్ బెంచ్ పరిశీలించిన తర్వాత ఇది ప్రాథమిక నివేదికని, తాజా నివేదికను అందజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వరదలపై చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిల్‌ను బెంచ్ మంగళవారం కొనసాగించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌లు వాదించారు. గోదావరి నది ప్రవహించే ఐదు జిల్లాలపై వరద ప్రభావం బాగా ఉందన్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు అలుగు పారిందన్నారు. ప్రాజెక్టు గేట్లు తెరుచుకోలేదన్నారు. దిగువన సుమారు 170 వరకు ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నిర్మల్, కొమురం భీమ్,భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు వంటి ప్రాంతాలపై భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. 19 జులై రోజున కేంద్రం ప్రభుత్వం హెచ్చరించిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అ నెల 28 వరకు భారీ వర్షాలు పడ్డాయని, ఇప్పటికీ వానలు పడుతూనే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. భూపాలపల్లి జిల్లాలో 5గురు, మరో చోట అదివాసీలు 9 మంది తమ ప్రాణాల్ని కాొపాడాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయిందన్నారు. వీళ్లును ప్రాణాలతో రక్షించేందుకు ప్రభుత్వం హెలికాఫ్టర్ పంపలేదన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదల ప్రభావం ఉందని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ తాజా పరిస్థితి నిమ్తితం విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది.ప్రభ్వుం హైకోర్టులో దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలోని వరదల కారణంగా 240 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6443 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయిని తెలిపింది.1,60 లక్షల ఎకరాల పంట దెబ్బతిండని, 57,688 మంది రైతులకు నష్టం చేకూరిందని ప్రభుత్వం తెలిపింది. రైతులు సాగు చేసిన సోయాబీన్, చెరుకు, కందులు, మినుములు వంటి పంటలు నీటమునిగాయని చెప్పింది. వర్షాలకు 190 సాగు చెరువులకు గండ్లు పడ్డాయని, 170 రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పింది. ఈనివేదిక వాస్తవ పరిస్థితులు ఏమాత్రం సంబంధం లేకుండా ఉందని పిటిషనర్ల న్యాయవాదులు చెప్పారు. తాజా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు నిర్వహించిన సర్వే నివేదికల ఆధారంగా కౌంటర్ దాఖలు చేయలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది.
1.60 లక్షల ఎకరాల్లో పంటనష్టం
RELATED ARTICLES