1.60 లక్షలు దాటాయ్‌

రాష్ట్రంలో కొత్తగా 2058 మందికి కరోనా పాజిటివ్‌
మరో 10 మంది మృత్యువాత
984కు చేరిన మృతులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య 1.60 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2058 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. 2180 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,60,571 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం 984 మంది మరణించారు. ఈ మేరకు సోమవారంనాటి కరోనా హెల్త్‌ బులెటిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 51,247 కరోనా పరీక్షలు నిర్వహించగా, 908 రిపోర్టులు రావాల్సి ఉన్నది. మొత్తం 22,20,586 పరీక్షలు నిర్వహించగా, 1,60,571 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,29,187 మంది కోలుకున్నారు. 984 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం గృహ, ఇతర సంస్థలలో మొత్తం 23,534 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో 1.64 శాతం ఉన్నది. కోలుకున్న వారు రాష్ట్ర స్థాయిలో 80.45 శాతం కాగా, జాతీయ స్థాయిలో 78.26 శాతం నమోదైంది. జిల్లాల వారీగా కొత్త కేసులు సోమవారంనాడు ఆదిలాబాద్‌లో 20,భద్రాద్రి- కొత్తగూడెంలో 75, జిహెచ్‌ఎంసిలో 277, జగిత్యాలలో 52, జనగామలో 30, జయశంకర్‌ భూపాల్‌పల్లిలో 28, జోగులాంబ గద్వాల్‌లో 29,కామారెడ్డిలో 43, కరీంనగర్‌లో 135,ఖమ్మంలో 103, కొమురంబీమ్‌ ఆసిఫాబాద్‌లో 24, మహబూబ్‌నగర్‌లో 38, మహబూబాబాద్‌లో 68, మంచిర్యాలలో 41, మెదక్‌లో38, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 97, ములుగులో36, నాగర్‌కర్నూల్‌లో 42, నల్లగొండలో 96, నారాయణపేట్‌లో 13, నిర్మల్‌లో 42, నిజామాబాద్‌లో 84, పెద్దపల్లిలో 48, రాజన్న సిరిసిల్లాలో 45, రంగారెడ్డిలో 143, సంగారెడ్డిలో 24, సిద్దిపేటలో 106, సూర్యాపేటలో 62, వికారాబాద్‌లో 24, వనపర్తిలో 23, వరంగల్‌ రూరల్‌లో 11, వరంగల్‌ అర్బన్‌లో 108, యాదాద్రి-భువనగిరిలో 53 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?