పెట్టుబడులు, మార్కెట్ లక్ష్యంగా వైభవోపేతమైన కార్యక్రమం
సుదీర్ఘ ప్రసంగాలు చేసిన భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
హూస్టన్: ప్రపంచ విద్యుత్ రాజధానిగా పిలుచుకునే హూస్టన్ నగరంలో ‘హౌడీ మోడీ’ కార్యక్రమం ఆదివారం భారత కాలమాన ప్రకారం రాత్రి 10.30 నుంచి జరిగింది. ఇందులో తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదికను పంచుకున్నారు. దాదాపు 600 సంస్థలు కలిసి నిర్వహిస్తున్న ‘హూడీ మోడీ’ కార్యక్రమం ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకుంది. వేదికకు ‘షేర్డ్ డ్రీమ్స్, బ్రయిట్ ఫ్యూచర్స్…టెక్సాస్ ఇండియా ఫోరమ్’అన్న టైటిల్ పెట్టారు. విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ ఎన్‌ఆర్‌జి స్టేడియంకు వచ్చిన ట్రంప్‌ను రిసీవ్ చేసుకున్నారు. భారత జాతీయ గీతం, అమెరికా జాతీయ గీతాలను వినిపించినప్పుడు ప్రేక్షకులందరూ గౌరవంతో లేచి నిల్చున్నారు. టెక్సాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ ‘హౌడీ మోడీ’ ఈవెంట్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. దానికి మిత్ర దేశంగా ఉన్నందుకు అమెరికా గర్విస్తుంది’ అన్నారు. టెక్సాస్‌కు చెంది న హూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జి ఫుట్‌బాల్ స్టేడియం ‘హౌడీ మోడీ’ ఈవెంట్‌కు వేదిక అయింది. ఎర్ర తివాచీ మీద నడుచుకుంటూ వేదికపైకి మోడీ, ట్రంప్ వెళ్లారు. ఈ ఈవెంట్‌లో దాదాపు 50,000 కుపైగా అమెరికాలోని ప్రవాస భారతీయులనుద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ మెగా ఈవెంట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుకుని, ప్రపంచంలోని బడా కంపెనీల సిఇఒలు హాజరయ్యారు. మోడీ ప్రసంగిస్తూ ‘ఇంత ఘనమైన అప్యాయతను కనబరుస్తున్నందుకు కృతజ్ఞతలు. హూస్టన్ రిసెప్షన్ నన్ను చాలా సంతోషపెట్టింది’ అన్నారు. ఆయన స్టేజిపైకి రాగానే ప్రేక్షకులకు వంగివంగి నమస్కరించారు. చేయి ఊపుతూ అందరినీ గ్రీట్ చేశారు. మోడీ వేదిక మీదకు వస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘హౌడీ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు ‘హూస్టన్‌ను ప్రధాని మోడీ ఎంచుకోవడం మమ్మల్ని సంతోషపరిచింది’ అని ఆ