హ్యూస్టన్ : ‘హౌడీ మోడీ’కి వేదికగా నిలిచిన హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జి స్టేడియం కు ఉందయం 6:30 గంటల నుండే అక్కడ ఉండే భారత సంతతి కుటుంబాలు రావడం ప్రారంభించాయి. 8 గం టలకు హాలునిండి పోయింది వారంతా కాషాయి కుర్తాలు, మూడు రంగుల చీరలు. నమో టీషర్ట్‌లుతో వచ్చారు. నిరసనలు: హ్యౌస్టన్‌లోని వివిధ ప్రాం తాల నుండి నిరసన కారులతో కూడిన బస్సులు (క్రౌన్ ప్లాజా హోటల్‌కు చేరుకున్నాయి. స్థానికులేగాక సుదూర ప్రాంతమైన డల్లాస్ నుండి కూడా వచ్చారు. వెను వెంటనే వేల సంఖ్యలో నిరసనకారులు హాలు బయట బారికేడ్లు నిర్మించిన ప్రాంతానికి చేరుకున్నారు. వారిని హ్యూస్టన్ పోలీసులు నిరసనకారుల చుట్టూ మొహరించి ఉన్నారు. శాంతియుత నిరసనలు: వారంతా వివిధ రకాలు టీషర్టలు ధరించారు. ప్లకార్డులు, బేనర్లను పట్టుకున్నారు. వాటిపై “మూక హత్యలను ఖండిస్తున్నాం” అని, భారతదేశంలో కుల పాత్రిపదిక హింసాకాండను నిలుపు చేయాలని, కశ్మీర్‌లో ఇటీవల అమలు జరుపుతున్న కమ్యూనికేషన్ దిగ్బంధనం నుండి అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) వరకు నిర్బంధ కేంద్రాలకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు, మోడీకి వ్యతిరేకంగా అనేక నినాదాలు రాసివున్నాయి. అదే విధంగా నిరసనకారుల చేతుల్లో కశ్మీరీ పతకాలు ఉన్నాయి మెగాఫోన్లు పట్టుకొని పెద్దపెట్టున నినదించారు. వారిలో ఎక్కువ మంది హ్యూస్టన్‌కు చెందిన వారైనప్పటికీ, టెక్సాస్‌లోని ఇతర పట్టణాల నుండి అనేక మంది భారత సంతతి వారు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కొందరైతే, న్యూయార్క్, న్యూజెర్సీ నుండి కూడా వచ్చి పాల్గొన్నారు. కొందరు తల్లిదండ్రులు హౌడీ మోడీ సమావేశంలో పాల్గొంటే, వారి పిల్లలు ఈ నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న వారిలో యువతదే మోజారిటీ. నిరసన ప్రదర్శనలతో పాటు సంగీతం చిందులు కూడా చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. హాలు లోపల జరిగిన సమావేశం కూడా 2 గంటలకు ముగిసింది.
‘హౌడీ మోడీ’లో హర్షధ్వానాలే కాదు.. నిరసనలు కూడా
RELATED ARTICLES