HomeNewsBreaking Newsహైదరాబాద్‌ ఉత్కంఠ విజయం..

హైదరాబాద్‌ ఉత్కంఠ విజయం..

9 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ..
న్యూఢిల్లీ:
ఐపిఎల్‌ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. వరుసగా మూడు ఓటములతో ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ(36 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 67), హెన్రీచ్‌ క్లాసెన్‌(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ మార్ష్‌ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాంత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఫిల్‌ సాల్ట్‌(35 బంతుల్లో 9 ఫోర్లతో 59), మిచెల్‌ మార్ష్‌(39 బంతుల్లో ఫోర్‌, 6 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే(2/20) రెండు వికెట్లు తీయాగా భువనేశ్వర్‌ కుమార్‌, అకీల్‌ హుస్సెన్‌, నటరాజన్‌, అభిషేక్‌ శర్మ తలో వికెట్‌ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే డేవిడ్‌ వార్నర్‌(0) డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, మిచెల్‌ మార్ష్‌ ధాటిగా ఆడారు. దాంతో పవర్‌ ప్లేలో ఢిల్లీ వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ.. సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ధాటికి ఢిల్లీ 9.2 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. ముందుగా ఫిల్‌ సాల్ట్‌ 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదగా.. ఆ కొద్ది సేపటికే మిచెల్‌ మార్ష్‌ 28 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్‌లో మిచెల్‌ మార్ష్‌కు ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. 112 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మయాంక్‌ మార్కండే విడదీసాడు. సాల్ట్‌ను రిటర్న్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే మిచెల్‌ మార్ష్‌ను అకీల హోస్సేన్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన ప్రియామ్‌ గార్గ్‌(12), సర్ఫరాజ్‌ ఖాన్‌(9) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌, రిపల్‌ పటేల్‌ విజయం కోసం ప్రయత్నించగా.. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దాంతో చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 26 పరుగులు అవసరమయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments