రాయదుర్గంలో గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కె.వి.సబ్ స్టేషన్
రూ.1400 కోట్ల వ్యయంతో ఏర్పాటు
ఒక్క క్షణం కూడా విద్యుత్‌కు అంతరాయం ఉండదు : మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ భారతదేశంలోనే రాయదుర్గంలో మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కె.వి.సబ్ స్టేషన్ అని, దీనితో హైదరాబాద్ నగరానికి మరో 2000 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు అస్కారం ఏర్పడిందని విద్యుత్ శాఖమంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. రూ.1400 కోట్ల వ్యయంతో ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశామని, త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. రాయదుర్గంలోని 400 కె.వి.గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌ను మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశామన్నారు. దీనితో ఒక్క క్షణం కూడా విద్యుత్ అంతరాయం ఏర్పాడదన్నారు. రింగ్ రోడ్ చుట్టూ 400 కె.వి.సబ్ స్టేషన్‌లు, 220 కె.వి.133, కె.వి.33 కెవి సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. నాలుగు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయుడం దీని ప్రత్యేకత అన్నారు. ఈ నాలుగు సబ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరమని, కానీ 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడమే దీని ప్రత్యేకతన్నారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు 3 కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మొదటి సారి మోనో పోల్స్ కూడా నియోగిస్తున్నామన్నారు. టిఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కొవిడ్‌తో పాటు అనేక ఆటంకాలు ఎదురైనా పనులు వేగంగా పూర్తి చేశామన్నారు.
హైదరాబాద్ నగరానికి… మరో 2000 మెగావాట్ల విద్యుత్
RELATED ARTICLES