హైదరాబాద్ : ఇటివల ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన భారత జట్టులో హై దరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడికు చోటు దక్కలేదు. అయితే ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ రాయుడు ను పక్కనపెట్టడంపై సెలక్టర్లపై కొందరూ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో హైదరాబాదీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా కూడా ట్వి ట్టర్ వేదికగా సెలక్టర్లపై మండిడుతూ రాయుడుకు అండగా నిలిచాడు. ఇప్పటికే తెలుగు క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిమానులు మండిపడుతుండగా.. ఓజా చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాయుడు కం టే విజయ్ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ కు వ్యంగ్యంగా.. మూడు రకాలుగా (త్రీ డైమెన్ష న్స్) ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై బిసిసిఐ కూడా స్పందిస్తూ.. రాయుడి బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్ఞాన్ ఓజా కూడా ఈ ట్విట్‌పై స్పందిస్తూ.. ‘హైదరాబాద్ క్రికెటర్లలో కొందరి పరిస్థితి ఇంతే. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కున్నా. నీ బాధను అర్థం చేసుకోగలను’ అని రాయుడికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఓజా ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. హైదరాబాద్ క్రికెటర్లపై భారత సెలక్టర్లు ఎప్పటినుంచో చిన్న చూపు పెడుతున్నారని మండిపడ్డాడు. మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్‌కు అవకాశం ఇవ్వకుండా అనుభవంలేని యువ క్రికెటర్‌కు చాన్స్ ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్‌కు సేవలు అందించిన ఓజాకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ హైదరాబాదీ క్రికెటర్ టెస్ట్ కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. కారణం లేకుండా జాతీయ జట్టు నుంచి అతన్ని తొలగించారు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఓజా సెలక్షన్ ప్యానెల్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ ఆఖరి టెస్టు మ్యాచ్‌లో ఓజా 10 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓజా 24 అంతర్జాతీయ టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టాడు.
హైదరాబాద్ క్రికెటర్లంటే చిన్నచూపే: ఓజా
RELATED ARTICLES