ప్రజాపక్షం/ హైదరాబాద్ మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘బోట్లు’ సిద్ధమయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడంతో జనం అతలాకుతమైన విషయం తెలిసిందే. కొన్ని కాలనీలు, బస్తీలు, రహదారులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోమూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార వర్గాలు అప్రమత్తమాయ్యయి. బస్తీలు, కాలనీలు నీటమునిగితే పరిస్థితి ఏమిటి? అప్పటికప్పుడు ప్రజలను వరదల నుంచి రక్షించాలంటే బోట్లను అందుబాటులో పెట్టుకోవాల్సిందేనని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎపి, తెలంగాణ టూరిజంకు చెందిన వివిధ పర్యాటక ప్రాంతాల నుంచి 40 బోట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
హైదరాబాద్‌లో 40 బోట్లు
RELATED ARTICLES