ముగిసిన దావోస్, లండన్, దుబాయ్ పర్యటన
ప్రజాపక్షం/హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్, లండన్, దుబాయ్‌లలో పర్యటించిన ఆయన సోమవారం నగరానికి వచ్చారు. తొలుత దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ పాల్గొన్నారు. ఆ తర్వాత లండన్‌కు వెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌లో పర్యటించారు. వారం రోజుల పాటు స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌తో పాటు లండన్, దుబాయ్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటించింది. ఈనెల 14వ తేదీన ఢిల్లీ నుంచి
స్విట్జర్ల్యాండ్ బయల్దేరిన రేవంత్ 15, 16, 17వ తేదీల్లో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు కేంద్రంగా పారిశ్రామికవేత్తలతో చర్చించారు. సుమారు రూ.40,000ల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి కోసం ఈనెల 18, 19 తేదీల్లో లండన్‌లో థేమ్స్ నది అభివృద్ధిపై అధ్యయనంతో పాటు ప్రవాస భారతీయులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. లండన్ పర్యటనలో సిఎం పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను సందర్శించారు. బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను ఆయన తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి
RELATED ARTICLES