ప్రజాపక్షం/హైదరాబాద్ లీగల్ : హైకోర్టు ప్రథమ మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ ప్రమా ణం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన ఆమె ఆలిండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ద్వారా యుపి కేడర్‌లో ఎంపికయ్యారు. అక్కడి అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి వచ్చాక తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు కొలీజియం, ఆపై రాష్ట్రపతి ఆమోదం తర్వాత బదిలీ వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపింది.
హైకోర్టు ప్రథమ మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి
RELATED ARTICLES