హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్ రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సోమవారం సిఫార్సు చేసింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్ 1970 ఆగస్టు 22న రంగారెడ్డి జిల్లాలో పుట్టారు. పీఆర్‌ఆర్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అన్ని కోర్టుల్లోనూ వాదనలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. రాజ్యాంగపరమైనవే కాకుండా సివిల్, క్రిమినల్, వినియోగదారుల హక్కులు, భూసేకరణ చట్టాలకు సంధించిన కేసులు వాదించారు. ఉమ్మడి హైకోర్టు లో న్యాయమూర్తిగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్గా రాష్ట్ర లోకాయుక్త గా పనిచేసి 2019లో దివంగతులైన జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డికి వీరి కుమారులు. విజయ్‌సేన్‌రెడ్డి వద్ద ఎందరో జూనియర్లు న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్ రెడ్డి
RELATED ARTICLES