హైదరాబాద్ : కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోకుండా తమ ఇండ్లను కూల్చేశారని పలువురు రైతులు హైకోర్టు అత్యవసర మెమో దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా 400 మంది పోలీసులు గ్రామంలోకి వచ్చి తమ ఇళ్లను కూల్చేశారని, ఇళ్ళను ఖాళీ చేయించాలని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొత్తగుట్టు గ్రామస్తులు సోమవారం మెమో వేశారు. ఇ. మంగవ్వతోపాటు 38 మంది మెమో దాఖలు చేశారు. అనంతగిరి రిజర్వాయర్ నీటి విడుదల చేసే ముందు ముంపు ప్రాంత రైతులకు చట్టప్రకారం పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని రైతులు హైకోర్టులో రిట్లు వేశారు. పునరావాస పునర్నిర్మాణ పథకాన్ని అమలు చేయాలని, ఈలోగా పిటిషనర్లను ఇండ్ల నుంచి ఖాళీ చేయించరాని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఈ ఉత్తర్వులు ఉన్నా అధికారులు ఈ నెల 18వ తేదీన భయోత్పాదం సృష్టించినట్లుగా కలెక్టర్, పోలీస్ కమిషనరులకు ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత రోజునే గ్రామంలోకి పెద్దసంఖ్యలో వాహనాలు 400 మంది జనం వచ్చి దౌర్జన్యంగా తమను ఇళ్ళ నుంచి ఖాళీ చేయిచారనే మెమోను మంగళవారం హైకోర్టు విచారణ చేయనుంది.