ప్రజాపక్షం/హయత్‌నగర్: తమ తల్లి దండ్రులకు భారంగా ఉన్నామంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత తన కుటుంబ సభ్యులతో కలసి కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి హయత్‌నగర్‌లోని శ్రీనివాసపురంలో నివసిస్తూ ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెలుగోడుకు చెందిన మరో యువతి గౌతమి పక్క పక్కనే నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలో మమత కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి బుధవారం బయలుదేరి వెళ్లగా ఇంటిలో ఎవరూ లేని సమయంలో స్నేహితులైన మమత, గౌతమి తమ తల్లిదండ్రులకు భారంగా ఉండడం ఇష్టం లేక చనిపోతునట్లు సూసైడ్ లేఖలో రాసి, గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
హృదయ విదారకరం ఈ ఆత్మహత్యలు
RELATED ARTICLES