జాయింట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం
చెన్నై: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ కలుషితంగా మారడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసిం ది. సుమారు 450 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సరస్సు కొన్ని దశాబ్దాల ముందు వరకూ హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చిందని గుర్తు చేసింది. ఇంత ప్రాముఖ్యత ఉన్న హుస్సేన్‌సాగర్‌లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరి, కాలుష్యాన్ని వెదజల్లుతున్నదని పేర్కొంటూ, సరస్సు నిర్వాహణ, ప్రక్షాళనకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. పట్టణాభివృద్ధి
శాఖ అడిషినల్ చీఫ్ సెక్రటెరీ నేతృత్వంలో, జాతీయ వెట్‌ల్యాండ్ అథారిటీ, రాష్ట్ర వెట్‌ల్యాండ్ అథారిటీ, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి), తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (టిఎస్‌పిసిబి) ప్రతినిధులు, తెలంగాణ పర్యావరణ శాఖ డైరెక్టర్ సభ్యులుగా జాయింట్ కమిటీ ఏర్పాటు కావాలని ఎన్‌జిటి పేర్కొంది. సరస్సులో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, వెంటనే ఈ పరిస్థితిని సరిదిద్దాలని డాక్టర్ లుబ్నా సర్వాత్ 2015 ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జిటి ఏడేళ్ల తర్వాత తీర్పును వెల్లడించింది. అప్పట్లో అత్యంత కీలకమైన అంశంగా పేర్కొంటూ, తక్షణ విచారణకు స్వీకరించాలని పిటిషన్‌దారుడు కోరారు. అనేకానేక వాదోపవాదాలు, వాయిదాల అనంతరం ఎట్టకేలకు తీర్పు వెలువడింది.
హుస్సేన్‌సాగర్ కాలుష్యంపై ఎన్‌జిటి ఆగ్రహం
RELATED ARTICLES