ప్రజాపక్షం / హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా చావ కిరణ్‌మయిని టిడిపి ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకురాలైన కిరణమయికి ‘బి ఫారమ్’ ను ఆదివారం అందజేశారు. టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నర్సింహులు, జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూ పాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్. రమణ మాట్లాడుతూ టిడిపి స్థాపించినప్పటి నుంచి బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణాలో టిడిపి సత్తా ఏమి టో మరోసారి నిరూపిస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కిరణ్‌మయి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.తెలంగాణా లో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా టిడిపి హాయంలోనే జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టిడిపి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు హుజూర్‌నగర్ ఉపఎన్నిక పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుందని, పార్టీని నమ్ముకున్న కేడర్‌లో న మ్మకం కలిగించాలంటే పోటీ చేయడమే సరైందని టిడిపి భావించింది.సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని చివరకు కిరణ్‌మయిని టిడిపి తమ అభ్యర్థిగా ప్రకటించింది.
నేడు కిరణ్‌మయి నామినేషన్ : హుజూర్‌నగర్ టిడిపి అభ్యర్థి కిరణ్‌మయి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా, నియోజకవర్గ నాయకులు పెద్దసంఖ్యలో కార్యకర్తలు హజరుకానున్నట్లు ఎల్.రమణ చెప్పారు.
హుజూర్‌నగర్ టిడిపి అభ్యర్థి కిరణ్‌మయి
RELATED ARTICLES