51 మంది మృత్యువాత
వరదల ధాటికి విరిగిపడుతున్న కొండచరియలు
పలు ఇళ్లు ధ్వంసం, రహదారుల దిగ్బంధనం
ఉత్తరాఖండ్‌లోనూ వర్ష బీభత్సం
న్యూఢిల్లీ : ఉత్తరభారతాన్ని వర్షాలు మరోసారి ముంచేస్తున్నా యి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యవస్తమైంది. ముఖ్యమంగా హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హిమాచల్‌లో 51 మంది మృత్యువాతపడగా, ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇరు రాష్ట్రాల్లోనూ కొం డచరియలు విరిగిపడుతుండడం వల్ల రహదారులపై రాకపోక లు నిలిచిపోయాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కిం ద పలువురు చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమ్మర్ హిల్‌లో ఉన్న ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు భూసమాధి అయ్యారు. పలువురు శిథిలాల కిందు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. కుంభవృష్టి కారణంగా రాష్ట్రంలో కొండచరియ లు విరిగిపడిన ఘటనల్లో ఇదిరెండవది. శివాలయంలోని శిథికా ల కింద భూ సమాధి అయిన ఏడుగురు మృతదేహాలను వెలికి తీసినట్లు సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. ఫగ్లి ప్రాంతం లో కొండచరియలు విరిగి పడగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. శిథిలాల నుంచి ఐదుగురి మృతదేహాలను వెళికి తీశా రు. మరో 17 మందిని రక్షించారు. సిమ్లాలో చోటు చేసుకున్న రెండు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 14 మంది దుర్మరణం చెందారు. సోమవారం నాడు రాష్ట్రంలోని అన్ని పాఠశాల లు, కాలేజీలను మూసివేశారు. విపత్తు వల్ల రాష్ట్రంలో 752 ర హదాహరులను మూసివేశారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేం ద్రం వెల్లడించింది. సోమవారం
కుల్లు, కిన్నౌర్, లహౌల్ మినహా 12 జిల్లాలకు గానూ 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంగళవారం నాటికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి..
సోలన్ జిల్లాలోని జాడోన్ గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో సహాయక సబ్బంది ఆరుగురిని రక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఏడుగురు చనిపోయారు. మృతులను గుర్తించినట్లు సోలన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ సింగ్‌గా వివరాలు వెల్లడించారు. బలెరా గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్‌షెహర్ మండలంలోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ చనిపోయిందని సోలన్ డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు. కాగా కూలిన శివాలయాన్ని సిఎం సందర్శించారు. శిథిలా కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హమీర్‌పుర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు చనిపోయారని, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ హేమ్‌రాజ్ బైర్వా తెలిపారు. రంగస్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో ఇల్లు కూలి ఓ మహిళ చనిపోయిందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మండి జిల్లాలోని సెగ్లీ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. మంగళవారం కూడా భారీ వర్షాల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 18 వరకు రాష్ట్రంలో తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉత్తరాఖండ్‌లోనూ వర్ష బీభత్సం
అటు ఉత్తరాఖండ్‌లోనూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి బద్రినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రికి వెళ్లే జాతీయ రహదారులపై పడ్డాయి. దెహ్రాదూన్, పౌరి, టెహ్రి, నైనితాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా ముగ్గరు మృతి చెందగా, వరదల్లో ఐదుగురు గల్లంతయ్యారు. డెహ్రాడూన్ శివారులో ఉన్న ఓ ప్రైవేట్ డిఫెన్స్ కాలేజీ భవనం పేక మేడల్లో కూలిపోయింది. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై సిఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు చార్‌ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించారు. కేదార్‌నాథ్ సమీపంలో ఉన్న లించోలి క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో 26 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు రుద్రప్రయోగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ చెప్పారు. రిషికేష్‌లోని మీరానగర్ పాంతాలు, శివ మందిర్ సమీపంలో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పూరి జిల్లా లక్ష్మణ్‌ఝులా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు గల్లంతయ్యారు.
హిమాచల్‌లో జలప్రళయం
RELATED ARTICLES