పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల పట్టు
జెపిసి లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్
సభ్యుల గందరగోళంతో స్తంభించిన ఉభయసభలు
న్యూఢిల్లీ : అదానీ అక్రమ వ్యాపారాల వివాదం గురువారం పార్లమెంటు ఉభయసభలనూ కుదిపేసింది. గౌతమ్ అదానీ కంపెనీల వల్ల తలెత్తిన సమస్యపైజాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేయాలని లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని 11 ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అదానీ సృష్టించిన సంక్షోభ సమస్యపై కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఐక్యంగా నిలదీయడంతో పార్లమెంటులో ప్రభుత్వం షాక్ తింది. పార్లమెంటుకు ఇంతకన్నా అతిముఖ్యమైన ప్రజా సమస్య మరొకటి ఏమి ఉంటుందని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కాంగ్రెస్‌పార్టీ ఈ సమస్యను మహా మెగాస్కామ్‌గాఅభివర్ణించింది. అదానీ విషయంలో ప్రధానమంత్రి చాలా స్పష్టంగా దొరికిపోయారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా చర్చకు తిరస్కరించారు. ఈ అంశంపై 267 నిబంధన కింద చర్చ జరపాలని రాజ్యసభలో తొమ్మిందిమంది ఎంపీలు నోటీసు ఇచ్చాయి. రాజ్యసభలో సిపిఐ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం, పి.సంతోష్ కుమార్ సహా సిపిఐ(ఎం) నాయకుడు ఎలమరమ్ కరీమ్, వి.శివదాసన్, డిఎంకె నాయకుడు తిరుచ్చి శివ, బిఆర్‌ఎస్ నాయకుడు కె.కేశవరావు, తృణమూల్ కాగ్రెస్ తదితర పార్టీలు సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్‌కు ఇచ్చిన నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని ఆయన తిరస్కరించారు. ఇచ్చిన నోటీసులను తాను చాలా క్షుణ్ణంగా పరిశీలించానని, అవన్నీ సక్రమంగా లేవని, సభలో తీవ్ర గందరగోళం నెలకొని ఉందని, ఎలాంటి క్రమశిక్షణా సభలో లేదని అందువల్ల చర్చకు అనుమతించడంలేదని జగదీప్ ధన్‌కర్ చెప్పిన సాకును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో రాజ్యసభలో మరింత గందరగోళం చెలరేగింది. లోక్‌సభలో కూడా ఓం బిర్లా ఇదేవిధంగా ప్రతిపక్ష ఎంపీలపట్ల స్పందించారు. ఆయన మాటలతో లోక్‌సభలో తీవ్ర గందరతోళం రేగింది. మధ్యాహ్నం వరకూ సభ వాయిదా పడింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి పదే పదే అన్నారు. అయితే అన్ని కార్యకలాపాలను వాయిదావేసి ఈ సమస్యపై చర్చ జరపాలని ఎంపిలు పట్టుపట్టారు. ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి విషయాలపైన అయినా చర్చంచడానికి సిద్ధంగా ఉందని ఒకవైపు చెబుతూ మరోవైపు ఆచరణలో అందుకు విరుద్ధంగా ప్రతిపక్షాలను ప్రశ్నించకుండా చేయడాన్ని పలు పార్టీల ఎంపీలు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియని తీవ్ర గందరగోళంమధ్య లోక్‌సభ రోజుకు పూర్తిగా వాయిదా పడింది. రాజ్యసభలో కూడా దాదాపు ఇదే పరిస్థితి తలెత్తింది. తొలుత పార్లమెంటు ప్రారంభం కాగానే అదానీ వ్యాపారాలపై హిండెన్‌బర్గ్ ప్రచురించిన నివేదికపై చర్చ జరపాలని ఉభయ సభల్లో ప్రతిపక్షాల నుండి డిమాండ్లు ప్రారంభం అయ్యాయి. పెద్ద పెట్టున ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల కార్లులు ప్రదర్శించారు. దాంతో మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. లోక్‌సభలోఅదానీ సమస్యపై చర్చకు స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సభమధ్యలోకి దూసుకువచ్చాయి. తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ(ఎం), సిపిఐ, సమాజ్‌వాదీపార్టీ, జెడి(యు), శివసేన, ఎన్‌సిపి, ఐయుఎంఎల్, నేషనల్ కానరెన్స్, ఆమ్ ఆద్మీపార్టీ, కేరళ కాంగ్రెస్‌పార్టీలు ఒక్కటిపై నిలిచి ప్రభుత్వాన్ని నిలదీశాయి.
వ్యూహంపై ప్రతిపక్షాల సమావేశం
సభాసమావేశాలకు ముందుగా మొదట ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపైన ఒక సమావేశం నిర్వహించాయి. ఈ మావేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం), డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీపార్టీ, జెడి(యు), శివసేన, ఎన్‌సిపి, ఐయుఎంఎల్, నేషనల్ కానరెన్స్, ఆమ్ ఆద్మీపార్టీ, కేరళ కాంగ్రెస్‌పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. సిపిఐ(ఎం) ఎంపి ఎలమరమ్ కరీమ్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్త అదానీ దేశాని కొల్లగొట్టారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లోని సొమ్ము ప్రభుత్వం దగ్గరే ఉండాలని అన్నారు. “ఇది అతి భారీ కుంభకోణం, ఈ సస్యను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళాలి, తప్పనిసరిగా దీనిపైదర్యాప్తు జరపాల్సిందే, అదానీవల్ల మార్కెట్ రూ.8.50 లక్షలకోట్లు కోల్పోయింది” అన్నారు. సమాజ్‌వాదీపార్టీ ఎంపి రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ప్రజలు కష్టపడి సంపాదించుకున్న పొదుపు మొత్తాలను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ఎల్‌ఐసిలో, ఇతర ఆర్థిక సంస్థలలో దాచుకుంటే దాన్ని తీసుకువెళ్ళి అదానీ కంపెనీల్లో మదుపు చేశారని, అదంతా గాలికిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని అన్నారు. తమ డబ్బు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో చాలా సురక్షితంగా ఉందని ప్రజలుభావిస్తున్నారని అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. టిఎంసి ఎంపి శంతనుసేన్ మాట్లాడుతూ, 267 నిబంధన కింద ప్రతిపక్షం డిమాండ్‌ను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. శివససేన (థాకరే) ఎంపిక ప్రియాంకా చతుర్వేది డిఎంకె నాయకుడు కనిమొళి కూడా ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి హాజయ్యారు.
హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చ జరపాల్సిందే
RELATED ARTICLES