ముంబయి : నూతన సంవత్సరం సందర్భంగా టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 2019 సెప్టెంబర్‌లో గాయపడి.. అప్పటి నుంచి జట్టుకు దూరం అయిన పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ ఎవరో ప్రకటించాడు. సెర్బియాకు చెందిన నటాషా స్టాకోవిక్ పబ్లిక్‌తో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు హార్థిక్ తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతను ఈ ప్రకటన చేశాడు. అంతేకాక, వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు హార్థిక్ ప్రకటించి మరో షాక్ ఇచ్చాడు. నటాషా చేతికి రింగ్ పెట్టుకొని ఉన్న ఫొటోలను హార్థిక్ షేర్ చేశాడు. ఓ ప్రైవేటు బోటుపై చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసి.. కొందరు సన్నిహితుల మధ్య వీరిద్దరు ఒకటైనట్లు తెలుస్తోంది. ”మే తేరా, తూ మేరీ జానే సారా హిందుస్తాన్ (నీకు నేను, నాకు నువ్వు హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి) అంటూ హార్థిక్ ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టాడు. దీంతో హార్థిక్ ప్రేమ గురించి వచ్చిన ప్రతీ రూమర్‌కి అతను చెక్ పెట్టేశాడు. బాలీవుడ్ నటి ఎల్లి అవ్మ్‌త్రో హార్థిక్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో కోకొల్లలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తామిద్దరు మంచి మిత్రులు మాత్రమే అని ఇరువురు స్పష్టం చేయడంతో వీటికి చెక్ పడింది. ఇప్పుడు హార్థిక్ స్వయంగా నటాషాతో ఉన్న ఫొటోని పోస్ట్ చేయడంతో అతని రిలేషన్‌షిప్ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోపై టీం ఇండియా స్పిన్నర్ యుజవేంద్ర చాహల్, బాలీవు్‌డ నటుడు అర్జున్ కపూర్, హార్థిక్ బంధువు పంఖురీ శర్మ లవ్, నవ్వుతున్న సింబల్స్ పెట్టి కామెంట్ చేశారు. హార్థిక్ అభిమానులు కూడా ఈ ఫొటోపై సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. వెన్ను భాగంలో గాయంతో హార్థిక్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లకు అతను దూరం అయ్యాడు. హార్థిక్ త్వరగా కోలుకొని మళ్లీ జట్టుతో జత కట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు.
హార్ధిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్
RELATED ARTICLES