రాకాసి బావిలో మరో మృతదేహం
మృతురాలు డిగ్రీ యువతి మనీషాగా గుర్తింపు
లిఫ్ట్ పేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డ ఉన్మాది
మరో యువతి మృతదేహం ఉన్నట్లుగా అనుమానం
విద్యార్థిని శ్రావణి హత్యకేసులో కీలక మలుపు
15 మంది యువకులు అరెస్టు
ప్రజాపక్షం/హైదరాబాద్/ బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో రెండు రోజుల క్రితం వెలుగు చూసిన పదో తరగతి విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసు ఉదంతం మరువకముందే మరో విద్యార్థిని హత్య వెలుగు చూ సింది. శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే మరో విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలు నెల క్రితం నుంచి కనిపించకుండా పోయిన డిగ్రీ విద్యార్థిని మనీషా (19)గా గుర్తించారు. అస్థికలను బావిలోంచి బయటికి తీసిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కెఎల్‌ఆర్ డిగ్రీ కాలేజీలో బికామ్ చదువుతున్న మనీషా ప్రియుడితో పారిపోయిందని గ్రామస్తులు ఇన్ని రోజులు భావించారు. తాజాగా ఆమె మృతదేహం అదే బావిలో లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారు. శ్రావణి కేసు మిస్టరీ వీడకముందే అదే బావిలో మరో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసులను సవాలుగా తీసుకున్నారు. సంచలనం రేపిన హాజీపూర్ హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రావణి, మనీషాలను హత్య కేసులో హాజీపూర్ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కీసరలో ఎసి మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై ఎపి, కర్ణాటక, హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయి. హాజీపూర్ నుంచి ప్రతి రోజు కీసరకు వెళ్లే క్రమంలో అమ్మాయిలను ట్రాప్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిలను అతడు హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇతడు ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడనే విషయాలు తెలుసుకునేందుకు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. కర్నూల్‌లో కూడా శ్రీనివాస్‌రెడ్డిపై హత్య కేసు నమోదై ఉందని తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డికి సైకో లక్షణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న విద్యార్థులకు తన బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఘాతకానికి పాల్పడే వాడని సమాచారం. శ్రావణి హత్య జరిగిన సమయంలో శ్రీనివాస్‌రె డ్డి గ్రామస్తులతో కొద్దిసేపు క్రికెట్ ఆడుకున్నాడని, అదే రోజు అ తను మూడు షర్టులను మార్చాడని, ఆ సమయంలో తమకు అ ర్ధం కాలేదని గ్రామస్తులు చెప్పారు. చిన్నతనం నుండి శ్రీనివాస్‌రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని చెబుతున్నారు.