క్వార్టర్స్‌లో జొకోవిచ్, సెరెనా, నిషికోరి
జ్వెరెవ్, ముగురుజ ఓటమి
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సోమవారం కూడా మిశ్రవ ఫలితాలు దక్కాయి. స్టార్ ఆటగాళ్లు కొందరూ చెమటోడ్చి నెగ్గగా.. మరికొందరూ ఘోర పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక్కడ జరిగిన పోటీల్లో మహిళల టాప్ సీడ్ సిమోనా హలెప్‌కు పెద్ద షాక్ తగిలింది. ప్రీ క్వార్టర్స్‌లోనే హలెప్ పోరాటం ముగిసింది. పురుషుల విభాగంలో కూడా మరో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ అలెక్సాండర్ జ్వెరెవ్‌ను కెనడాకు చెందిన మిలొస్ రౌనిక్ చిత్తు చేశాడు. ఇక పురుషుల టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, అమెరికా స్టార్ మాజీ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సునాయాసంగా క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లారు. జపాన్ సంచలనం ఎనిమిదో సీడ్ నిషికోరి అద్భుతమైన పోరాటంతో చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. మహిళల విభాగంలో నాలుగో సీడ్ ఒసాకా అలవోకగా తర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టింది.
టాప్ సీడ్‌కు షాక్..
రొమానియా స్టార్, టాప్ సీడ్ సిమోనా హలెప్‌కు ప్రీ క్వార్ట్‌ర్స్‌లోనే షాక్ తగిలింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో హలెప్ (రొమానియా) 1 6 4 తేడాతో అమెరికా స్టార్ మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది. ఇంతకుముందు మూడో రౌండ్‌లో తన అక్క వీనస్ విలియమ్స్‌ను ఓడించిన హలెప్‌పై నాలుగో రౌండ్ మ్యాచ్‌లో చెల్లి సెరెనా ప్రతీకారం తీర్చుకుంది. సెరెనా దూకుడు ముందు హలెప్ తేలిపోయింది. ఆరంభం నుంచి చెలరేగి ఆడిన సెరెనా వరుస సెర్వీస్‌లతో హలెప్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తొలి సెట్‌ను సెరెనా 6 భారీ తేడాతో గెలుచుకుంది. తర్వాత రెండో సెట్లో పుంజుకున్న హలెప్ ఎదురుదాడికి దిగింది. దీంతో ఈ సెట్ హోరాహోరీగా సాగింది. దూకుడుగా ఆడిన హలెప్ సెరెనాపై పైచెయ్యి సాధించి రెండో సెట్‌ను 6 గెలుచుకంది. ఇక తర్వాతి నిర్ణయాత్మకమైన ఆఖరి సెట్ ఇద్దరికి కీలకంగా మారింది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే ఈ సెట్‌లో సెరెనా చివరి వరకు ధైర్యంగా పోరాడి 6 ఈ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టాప్ సీడ్ పోరాటం ప్రీక్వార్టర్స్‌లోనే ముగిసింది. మరోవైపు చెలరేగి ఆడిన సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ మరో మ్యాచ్‌లో జపాన్ యువ స్టార్ నాలుగో సీడ్ నౌమి ఒసాకా 4 6 6 13వ సీడ్ అనస్తాసిజ సెవస్టోవా (లత్వియా) విజయం సాధించి తర్వాతి రౌండ్‌లో ప్రవేశించింది. తొలి సెట్‌ను కోల్పోయిన ఒసాకా తర్వాతి సెట్లలో పుంజుకొని గొప్పగా ఆడింది. వరుస సెట్లను గెలిచి క్వార్టర్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
స్విటిలోనా ముందంజ..
మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఉక్రెయిన్ స్టార్ క్రీడాకారిణి ఎలినా స్విటొలినా 6 1 6 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను చిత్తు చేసి టాప్ ప్రవేశించింది. తొలి సెట్‌ను ఈజీగా గెలుచుకున్న స్విటొలినా రెండో సెట్‌లో మాత్రం ఓటమి పాలైంది. చివరిదైన నిర్ణయాత్మకమైన సెట్‌లో మాత్రం దూకుడును ప్రదర్శించి మ్యాచ్‌ను కాపాడుకుంది. మరో మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ 18వ సీడ్ ముగురుజకు ఏడో సీడ్ కారొలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) షాకిచ్చింది. ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్లిస్కొవా 6 6 ముగురుజను వరుస సెట్లలో ఓడించి ముందంజ వేసింది.
క్వార్టర్స్‌లో జొకోవిచ్..
పురుషుల విభాగంలో సెర్బియా స్టార్ టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ సునాయాసంగా క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్ (సెర్బియా) 6 6 6 6 15వ సీడ్ డానిల్ మెడ్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయికి తగ్గట్టు ఆడుతూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టీ పోటీ ఎదురవడంతో ఈ సెట్‌ను జొకోవిచ్ కోల్పోయాడు. తర్వాత జోరందుకున్న జోకోవిచ్ వరుస సెట్లలో విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. టైటిల్ కోసం మరో అడుగు ముందుకేశాడు.
జ్వెరెవ్‌కు ఇంటికి..
పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెక్సాండర్ జ్వెరెవ్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 16వ సీడ్ మిలోస్ రౌనిక్ (కెనడా) 6 6 7 తేడాతో అలెక్సాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. మ్యాచ్‌లో రౌనిక్ అసాధారణ ఆటను కనబర్చాడు. దూకుడుగా ఆడుతూ జ్వెరెవ్‌ను ముప్పుతిప్పలు పట్టించాడు. ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం సాధించిన రౌనిక్ తొలి సెట్‌ను 6 సునాయాసంగా గెలుచుకున్నాడు. తర్వాతి సెట్‌లోనూ అదే జోరును కనబర్చుతూ జ్వెరెవ్‌పై వరుసదాడులు చేశాడు. దీంతో ఈ సెట్‌ను కూడా రౌనిక్ 6 భారీ తేడాతో గెలుచుకున్నాడు. అనంతంర జరిగిన ఆఖరి సెట్‌లో జ్వెరెవ్ కొద్దిగా పోరాడు. ఈ సెట్ హోరాహోరీ గా సాగింది. చివర్లో టై బ్రేకర్‌లో ఈ సెట్‌ను సొంతం చేసుకున్న రౌనిక్ దర్జాగా టాప్ చోటు దక్కించు కున్నాడు. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ బొర్న కొరిక్ (క్రొయేషియా)పై లుకాస్ పౌలే (ఫ్రాన్స్) 6 6 7 7 చెమటోడ్చి నెగ్గాడు.
సిషికోరి అద్భుత పోరాటం..
జపాన్ స్టార్ ఆటగాడు 8వ సీడ్ కీ నిషికోరి అసాధారణ పోరాటంతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఇక్కడ జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో నిషికోరి (జపాన్) 6 4 7 6 7 తేడాతో 23వ సీడ్ పబ్లొ కరెనొ బుస్టా (స్పెయిన్)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో ఓటమిపాలైన నిషికోరి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తర్వాతి సెట్లలో అద్భుతంగా పోరాడాడు. ముందు హోరాహోరీగా తలపడి మూడో సెట్‌ను టై బ్రేకర్‌లో గెలుచుకున్నాడు. అనంతరం మరింత దూకుడును కనబర్చుతూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. ఈ సెట్‌ను కూడా 6 గెలుచుకొని మ్యాచ్‌ను చెరో రెండు సెట్లతో సమం చేశాడు. ఇక ఫలితాన్ని నిర్ధేశించే ఆఖరి సెట్‌లో మారోసారి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నువ్వా..నేనా.. అన్నట్టు సాగిన ఈ నిర్ణయాత్మక సెట్‌లో చివరికి నిషికోరి టై బ్రేకర్‌లో దక్కించుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. (5 గంటల 5 నిమిషాల) పాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో జపాన్ స్టార్ చిరస్మరణీయ ఆటను కనబర్చి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. మరోవైపు బుస్టా కూడా అసాధారణ పోటీని కనబర్చి అందిరి ప్రశంసలు పొందాడు.
హలెప్ నిష్క్రమణ
RELATED ARTICLES