న్యూయార్క్: సోమవారం నుంచి ప్రారంభమైన యుఎస్ ఓపెన్ టెన్నిస్‌లో స్టార్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. మమొరౌండ్‌లో ఫెదరర్, జోకోవిక్, సెరెనా విలియమ్స్, ప్లిస్కొవా, వీనస్‌లు రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లగా మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం) జరిగిన తొలి రౌండ్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, ఫ్యాబియానో, రెబ్లేవ్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. మహిళ సింగిల్స్‌లో నవామి ఒసాకా, కలిన్‌స్కెయా, సిమోనా హాలెప్, సీ గాఫ్‌లు రెండో రౌండ్‌లోకి దుసుకెళ్లారు. అన్‌సీడెడ్ ఆస్రేలియా ఆటగాడిపై రఫా అలవోకగా గెలుపొందాడు. నాదల్ ధాటికి మిల్‌మాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా పోవడంతో రఫా సునయానంగా పాయింట్లు సాధిస్తూ 6 6 6 విజయానందుకున్నాడు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ ఆటగాడైనా ఇటలీ కుర్రాడి చేతిలో ధీమ్ ఓటమిని చవిచూశాడు. నాలుగో ర్యాంకులో కొనసాగుతున్న ధీమ్‌కు మొదటి రౌండ్ నుంచి చుక్కలు చూపించాడు ఫ్యాబియానా. అయితే రెండో గేమ్‌లో కోటుకొని సెట్ గెలుచుకున్న థీమ్‌కు మిగతా సెట్టలోనూ ఫ్యాబియానా గట్టిపోటీనిస్తూ 6 3 6 6 పాయింట్లు సాధించి గేమ్‌ను సొంత చేసుకున్నాడు 31 ఏళ్ల ఇటలీ కుర్రాడు. హోరాహరీగా సాగిన మఱో గేమ్ రూబ్లెవ్ గెలుపొందాడు. గ్రీసుకు చెందిన ట్సిట్సిపస్‌ను 6 6 7 7 ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు.
హలెప్ దూకుడు..
మహిళల సింగిల్స్ సీమోన హాలెప్ అలవోకగా విజయం సాధించి రౌండోలోకి ప్రవేశించింది. అమెరికాకు చెందిన ఎన్‌గిబ్స్‌పై పోరుకు దిగిన ఈ రూమెనియా సుందరి తొలిసెట్ అలవోకగా గెలుచుకున్నా రెండో సెట్లో కాస్తా ప్రతిఘటన ఎదురై ఓడిపోయింది. ఆ తరువాతి సెట్‌లో తేరుకొని గిబ్స్‌కు ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగి ఆడటంతో 6 3 6 గేమ్‌ను సొంత చేసుకుంది. టెన్నిస్ ర్యాంకింగ్స్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్న జపాన్ క్రీడాకారిణి నవామి ఒసాకా సులువుగా రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. రష్యాకు చెందిన బ్లింకోవాను 6 6 6 వరుస సెట్లతో గెలుపొంది గేమ్ స్వాధీనం చేసుకుంది. రెండో సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగినా చివరి సెట్‌లో బ్లింకోవాను మట్టికరిపించిందీ జపాన్ భామ. మరో గేమ్‌లో అమెరికా స్టార్ ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్ అయినా సోలెన్ స్టిఫెన్స్ ఓటమి పాలెంది. గతేడాది యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచి ఈ యువస్టార్‌కు ఈసారి కలిసిరాలేదు. దీంతో రెండు సెట్లలోనూ ఓడి ఘోర పరాభావంతో టోర్ని నుంచి వైదొలిగింది. రష్యాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి అయినా కలిన్‌స్కేయా 6 6 వరుస సెట్లతో విజయం సాధించింది. ర్యాంకింగ్స్‌లో స్టిఫెన్స్ 10, కలిన్‌స్కేయా 127 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. కాగా, కలిన్‌స్కేయాకు ఇది తొలి గ్రాండ్‌స్లామ్‌లో తొలిగెలుపు.
హలెప్ అలవోకగా..
RELATED ARTICLES