మృతిడి నోట్లో గుడ్డలు, కాళ్లు, చేతులు కట్టేసి ఉరేసిన వైనం
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ప్రజాపక్షం/బాలాపూర్ ; హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఆర్‌సిఐ రోడ్డులోని ఓ డెకరేషన్ వస్తువులు ఉండే షెడ్‌లో ఉరి వేసుకున్న ఘటన ఆదివారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఇది హత్యా.. ఆత్మహత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయబాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం… బాలాపూర్ ఆర్.సి.ఐ రోడ్డులో డెకరేషన్ చేసే వస్తువులు ఉన్న ఓ షెడ్‌లో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వచ్చిందని చెప్పారు. దాంతో అక్కడి తమ సిబ్బంది వెళ్లగా షెడ్‌లో రాడ్‌కు ఉరివేసుకుని చనిపోయిన వ్యక్తి ఉన్నాడని, మృతుని నోట్లో గుడ్డలు, కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి ఉన్నట్లు ఆయన తెలిపారు. మృతుడు బాలాపూర్‌కు చెందిన జోన్నాడ ప్రశాంత్(22) అని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్‌ది హత్యా…? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
హత్యా… ఆత్మహత్యా?
RELATED ARTICLES