మిర్పూర్: భారత్- మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. రెండో ఇన్నిం గ్స్ ప్రారంభం వరకు టీమిండియాదే పూర్తి ఆధిపత్యం కనిపించగా.. రఫ్ ప్యాచెస్ ఏర్పడిన పిచ్‌పై బంగ్లా స్పిన్నర్లు దుమ్ములేపారు. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాకిచ్చారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(3/12) తీన్మార్ వేయడంతో టీ మిండియా 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా స్పిన్ ధాటికి శుభ్‌మన్ గిల్(7), కేఎల్ రాహుల్(2), విరాట్ కోహ్లీ(6), విరాట్ కోహ్లీ(1) క్రీజులో నిలబడలేకపోయారు. మూడో రోజు ఆట ముగి సే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(26 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ జయదేవ్ ఉనాద్కత్(3 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు కావాలి. మరోవైపు బంగ్లా గెలుపునకు 6 వికెట్లు కావాలి. అయితే రేపు(ఆదివారం) ఉదయం రెండు వికెట్లు తీస్తే తమదే విజయమని బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహ్‌దీ హసన్ మీరాజ్ అన్నా డు. రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన మెహ్‌దీ హసన్.. పిచ్ పూర్తిగా మారిందని, బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. ’మేం సానుకూల ఆలోచనల తో ఉన్నాం. పిచ్ పూర్తిగా మారింది. బ్యాటింగ్ చే యడం చాలా కష్టం. ఇది మాకు మంచి అవకా శం. భారత్‌లో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రేపు ఉదయం రెండు వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు. విజయం సాధించడానికి ఇది బంగారం లాంటి అవకాశం. కోహ్లీ ఔట్ చేసి న బాల్ చాలా గొప్పది. రౌఫ్ ప్యాచెస్‌లో పిచ్ అ య్యేలా బంతులు వేసాను. స్పిన్నర్లకు ఇది మంచి ట్రాక్. రేపు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయం కోసం కృషి చేస్తాను’అని మెహ్‌దీ హసన్ చెప్పుకొచ్చాడు. 7/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్.. 231 పరుగులకు కుప్పకూలింది. జకీర్ హసన్(51), లిటన్ దాస్(73) హాఫ్ సెంచరీలతో బంగ్లాను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌కు తలో వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్ లేని లోటు కనిపించింది. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై భారత పేసర్లు వికెట్ల కోసంశ్రమించాల్సి వచ్చింది. లేకుంటే బంగ్లాదేశ్ 200లోపే ఆలౌటయ్యేది.
హడలెత్తించిన బంగ్లాదేశ్
RELATED ARTICLES