ఫిడే తాజా ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ : తెలుగు తేజం కోనేరు హంపి కెరీర్ లో మరో మైలురాయిని దాటింది. ఫిడే తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ర్యాంకుల్లో తొలి స్థానంలో చైనాకు చెందిన హూ ఇఫాన్ వుంది. తన చెస్ కెరీర్ లో కోనేరు హంపి అద్భుత ప్రతిభతో దూసుకుపోతోంది. తాజాగా ఫిడే (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) విడుదల చేసిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది. హంపికి 2,586 ఎల్లో రేటింగ్ పాయింట్లు రాగా, చైనాకు చెందిన హూ ఇఫాన్ 2,658 ఎల్లో రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకూ సెక్‌ండ ర్యాంకర్ గా ఉన్న చైనా క్రీడాకారిణి జూ వెన్ జున్ 2,583 పాయింట్లతో హంపి తర్వాత స్థానంలో మూడో ర్యాంకుకు దిగజారింది. ఏపీకి చెందిన మరో గ్రా్‌ండ మాస్టర్ ద్రోణవల్లి హారిక 9వ ర్యాంక్ లో వుండడం విశేషం. హారికకు 2,517 పాయింట్లు వచ్చాయి. 2019 డిసెంబర్‌లో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించిన హంపి.. ఇటీవల ప్రతిష్ఠాత్మక కెయిన్స్ కప్‌ను కైవసం చేసుకొని సత్తాచాటింది.
హంపికి రెండో ర్యాంక్
RELATED ARTICLES