సెయింట్ జాకబ్‌హలె (స్విట్జర్లాండ్): బసెల్‌లోని సెయింట్ జాకబ్ హలెలో జరిగిన స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల టైటిల్ ను తెలుగు తేజం పివి సింధు కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ లో భారత వీరుడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఫైనల్ చేరాడు. కానీ, విజేతగా నిలవలేకపోయాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21 21 తేడాతో థాయిలాండ్‌కు చెందిన బుసానన్ ఆంబాబ్రుగ్‌ఫాన్‌పై సునా యాస విజయానిన నమోదు చేసింది. తొలి సెట్‌లో కొంత వరకు ప్రతి ఘటనించిన బుసానన్ రెండో సెట్‌లో ఆ మాత్రం ఎదురుదాడి కూడా చేయకుండా సింధుకు దాసోహం అయింది. అంతకు ముందు సింధు క్వార్టర్ పైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లిని కూడా వరుస సెట్లలో ఓడించింది. సెమీఫైనల్‌లో థాయిలాండ్‌కే చెందిన సుపానిదా కాటెథాంగ్‌పై విజయం సాధించి ఫైనల్ చేరింది. అదే ఒరవడిని కొనసాగించి విజేతగా నిలిచింది. కాగా, పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రణయ్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆంథోని సినిసుకా గింటింగ్ చేతిలో 19 21 8- తేడాతో ఓటమిపాలయ్యాడు. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, సెకండ్ సెట్‌లో అతను చెలరేగిపోయాడు. ప్రత్యర్థి అద్భుతంగా ఆడినప్పటికీ, అందుకు దీటుగా సమాధానమిస్తూ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, చివరిదైన మూడో సెట్‌లో అదే స్థాయిలో ఆడలేకపోయాడు. ప్రణయ్ పూర్తిగా నీరసించిపోగా, గింటింగ్ మరింతగా రెచ్చిపోయి, సునాయసంగా విజయం సాధించాడు. టైటిల్‌ను అందుకున్నాడు.
స్విస్ ఓపెన్ క్వీన్ సింధు
RELATED ARTICLES