HomeNewsBreaking Newsస్వాతంత్య్రోద్యమంలో పాత్రలేని ఆర్‌ఎస్‌ఎస్‌

స్వాతంత్య్రోద్యమంలో పాత్రలేని ఆర్‌ఎస్‌ఎస్‌

త్యాగధనుల పార్టీ సిపిఐపార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవంలో డి.రాజాన్యూఢిల్లీ : త్యాగ ధనుల పార్టీ సిపిఐ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్రా లేదన్నారు. భారత కమ్యూనిస్టుపార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన సందర్భంగా న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయం అజయ్‌ భవన్‌లో డి.రాజా పార్టీ పతాకం ఎగురవేసి ప్రసంగించారు. ఆధునిక భారతదేశ నిర్మా ణం కోసం కమ్యూనిస్టు పార్టీ గొప్ప పోరాటాలు చేసిందని, అదేసమయలో స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్రా లేని ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ వారసురాలుగా చెప్పుకునే హక్కు ఏ మాత్రం లేదని ఉద్ఘాటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం మతోన్మాదం, కుల,వర్గవిభేదాలు సృష్టించే విధానాల్లోనే పురోగతి సాధించిందని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మహిళలపట్ల వివక్ష చూపిస్తూ, ఆ వివక్ష అమలు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిస్తోందని, దళతులు, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా హిందుత్వ పేరిట తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టుపార్టీ స్వేచ్ఛకోసం పోరా టం చేసిందని, కార్మికుల సంకెళ్ళు తొలగించేందుకు, వారి సంక్షేమం కోసం పోరాటాలు చేసిందన్నారు. సిపిఐ మార్గదర్శకత్వంలో దేశంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు గొప్ప పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారని, అందుకోసం ఎఐకెఎస్‌, ఎఐఎస్‌ఎఫ్‌ వంటి ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయని చెప్పారు. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని,రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ రచనాసభను ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టుపార్టీయే మొట్టమొదట ప్రతిపాదించిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ రచనకు డా.బిఆర్‌ అంబేద్కర్‌ దోహదం చేశారన్నారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం దేశంలో అల్లర్లు, మత ఉద్రిక్తతలు సృష్టిస్తూ ఇప్పటికీ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.97 సంత్సరాల క్రితం ఇదేరోజు కాన్పూర్‌లో ఆవిర్భవించిన కమ్యూనిస్టుపార్టీ, ప్రభుత్వరంగంలో ప్రముఖ పాత్ర వహించిందన్నారు. ప్రణాళిక, జాతీయీకరణ, భాషాప్రయుక్త రాష్ట్రాలు, నూతన ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, వ్యవసాయ అభివృద్ధి వంటి అనేక విషయాల్లో పార్టీ కీలకపాత్ర వహించిందన్నారు. భారతదేశం ఈనాడు ప్రపంచ పేదరికం సూచికల్లో 160 దేశాలలో 101వ స్థానంలో ఉందని, అంబానీలు, ఆదానీలు దేశాన్ని పాలించడంవల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ఆదానీ, అంబానీల సారథ్యంలో ఉన్న కార్పొరేట్లకు సేవలు చేసేందుకే మోడీ ప్రభుత్వం కట్టుబడిందని విమర్శించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, దళితులు, అట్టడుగు బలహీన వర్గాలు మోడీ పాలనలో తిరిగి దాడులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష పాటించే మనుస్మృతి ఆధారిత హిందూ రాష్ట్ర మార్గదర్శకత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలన దేశంలో పార్లమెంటును తిరస్కరిస్తోందని, కమ్యూనిస్టులనే తదుపరి లక్ష్యంగా ఎంచుకుంటోందన్నారు. కానీ కమ్యూనిస్టులు బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌లకు అందుకు తగిన సమాధానం చెబుతారన్నారు. వారు కనీసం పార్టీని ముట్టుకోను కూడా ముట్టుకోలేరని, వారికి ఆ విషయం బాగా తెలుసునన్నారు. వారు ఆలాంటి చర్యలకు పాల్పడితే, తగిన పర్యవసానాలు ఎదుర్కొంటారని రాజా హెచ్చరించారు. కొత్త తరం యువకులు పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని డి. రాజా హర్షం ప్రకటించారు. ఢిల్లీ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి దినేశ్‌ వర్షణే ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యర్తలు, మహిళలు, పిల్లలు, రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు అజయ్‌ భవన్‌లో సందడి వాతావరణం సృష్టించారు. యువతీ యువకులు, బాలలు, బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. మొదట డి.రాజా కార్యకర్తలు, అతిథుల నడుమ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్‌ఎ డాంగే, ఎస్‌వి ఘాటే వంటి గొప్ప గొప్ప నాయక ప్రముఖులు పార్టీ ఆవిర్భావ సభ్యులుగా ఉన్నారని నివాళులర్పించారు. భారత కమ్యూనిసు ్టపార్టీకి దీర్ఘకాలంగా సేవలు అదిస్తున్న ముగ్గురు ప్రముఖులు బాలకృష్ణన్‌, అనిల్‌ రజిమ్‌వాలే, రాజన్‌లను డి.రాజా శాలువాలతో సత్కరించి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. ఎన్‌.చిదంబరం కూడా పాల్గొన్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి విక్కీ ముందుగా స్వాగతం పలికి సభ ఉద్దేశాన్ని వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments